వందేళ్ల తర్వాత హోలీ రోజే చంద్ర గ్రహణం.. గర్భిణీలు జాగ్రత్తగా ఉండాల్సిందే!
హిందూ సంప్రదాయం ప్రకారం ఫాల్గుణ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజున హోలీని జరుపుకుంటారు. అంటే మార్చి 25న హోలీ పండుగ. అయితే వంద సంవత్సరాల తర్వాత హోలీ పండుగ రోజే చంద్ర గ్రహణం
దిశ, ఫీచర్స్ : హిందూ సంప్రదాయం ప్రకారం ఫాల్గుణ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజున హోలీని జరుపుకుంటారు. అంటే మార్చి 25న హోలీ పండుగ. అయితే వంద సంవత్సరాల తర్వాత హోలీ పండుగ రోజే చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కూడా ఇదే. కాగా, ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలంట. వీరు ఏమాత్రం అశ్రద్ధ చేసినా అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది అంటున్నారు పండితులు. కాగా, చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈసారి చంద్రగ్రహణం మార్చి 25 ఉదయం 10:24 నుండి మధ్యాహ్నం 3:01 గంటల వరకు ఉంటుంది. అంటే గ్రహణం మొత్తం 4 గంటల 36 నిమిషాల పాటు ఉంటుంది. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ఈ సమయంలో అస్సలే బయటకు రాకూడదు. ఎందుకంటే గ్రహణం యొక్క కాంతి గర్భిణీ స్త్రీలు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే కత్తెర, సూది, కత్తులు లాంటివి అస్సలు వాడకూడదు. వీలైనంత వరకు గర్భిణీలు ఈ సమయంలో నిద్రపోవడం చాలా మంచిది అంటున్నారు పండితులు.
Read More..