బేబీ బంప్ కాంపిటీషన్.. టైటిల్ గెలుచుకున్న తొమ్మిదినెలల గర్భిణి

దిశ, ఫీచర్స్ : ప్రసవ తేదీ దగ్గరపడే కొద్దీ గర్భిణుల పొట్ట పెరగడం సహజం.

Update: 2022-06-03 13:45 GMT

దిశ, ఫీచర్స్ : ప్రసవ తేదీ దగ్గరపడే కొద్దీ గర్భిణుల పొట్ట పెరగడం సహజం. ఈ సమయంలో ప్రెగ్నెంట్ మహిళలు అనేక జాగ్రత్తలు తీసుకుంటారని తెలిసిందే. ఇదిలా ఉంటే.. కాబోయే తల్లుల కోసం నికరాగ్వాలో బేబీ బంప్‌ కాంపిటీషన్స్ ఏర్పాటుచేశారు. ఆ దేశ మదర్స్ డే సందర్భంగా రాజధాని నగరం మనాగ్వాలో స్థానిక రేడియో స్టేషన్ వారు ఈ పోటీలు నిర్వహించారు. ఈ మేరకు పోటీలో పాల్గొన్న 19 మంది గర్భిణులు తమ బేబీ బంప్స్ ప్రదర్శించారు. ఇందులో తొమ్మిది నెలల గర్భిణి 'లీలా రెబెకా హెర్నాండెజ్' బిగ్గెస్ట్ బేబీ బంప్ టైటిల్ గెలుపొందింది. 'ఆమె బొడ్డు సుమారు 57 సెం.మీ(22 అంగుళాలు) ఉంది. ఇందుకు బహుమతిగా లీలా.. ఒక రిఫ్రిజిరేటర్, బేబీ ప్రొడక్ట్స్‌తో పాటు 5 వేల కార్డోబాస్ (రూ.10,900) అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నా బొడ్డు పెద్దగా ఉందని భావించిన నా స్నేహితులు ఈ పోటీలో పాల్గొనాలని సూచించడం వల్లే నేను టైటిల్ గెలుచుకోగలిగాను' అని తెలపడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ పోటీ ఆలోచన పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News