పచ్చబొట్టు వేయించుకోవాలనుకుంటున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..

కొంతమందిలో టాటూ వేసుకోవాలనే క్రేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది.

Update: 2024-10-07 11:30 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : కొంతమందిలో టాటూ వేసుకోవాలనే క్రేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే చాలా మంది వ్యక్తులు తమ శరీరం పై చిన్న టాటూ వేసుకుంటారు. కొంతమంది వ్యక్తులు ప్రత్యేకమైన చిహ్నాలను తయారు చేసుకుంటే, మరికొందరు తమ ప్రేమను వ్యక్తీకరించడానికి వ్యక్తి పేరును పొందుపరుస్తారు. పచ్చబొట్టు వేయించుకోవడం అనేది ఎవరికైనా థ్రిల్లింగ్ అనుభవంగా ఉంటుంది. ఈరోజుల్లో ముఖ్యంగా యువతలో టాటూలు వేయించుకునే ట్రెండ్ ఎక్కువగా ఉంది. ప్రజలు తమ శరీరంలోని వివిధ భాగాల పై పచ్చబొట్లు వేసుకుంటుంటారు. అయితే దీనికి ముందు, తరువాత కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేకపోతే మీరు చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు.

ఎవరైనా పచ్చబొట్టు వేయించుకోవాలనుకుంటే ముందుగా సరైన స్థలాన్ని నిర్ణయించుకోవాలి. అకస్మాత్తుగా కళాకారుడి దగ్గరికి వెళ్లి ఒకేసారి అనేక డిజైన్‌లను చూసి గందరగోళానికి గురవుతుంటారు. అలా కాకుండా ఏ డిజైన్‌ను వేయించుకోవాలనుకుంటున్నారో దాని గురించి ముందుగానే సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే టాటూ వేయించుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు, తర్వాత మీరు చర్మ సంరక్షణ, ఆరోగ్యానికి సంబంధించి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

కొత్త సూదిని ఉపయోగించండి..

పచ్చబొట్టు వేయించుకోబోతున్నట్లయితే కొత్త సూదిని ఉపయోగించాలని కళాకారుడితో ముందుగానే మాట్లాడాలి. దానికోసం అదనంగా బిల్ వేసినా పర్వాలేదు. పాత సూదులు అనేక వ్యాధుల సంక్రమణకు కారణమవుతాయి. చిన్న ఆరోగ్య సమస్యలే కాకుండా పెద్ద వ్యాధులకు కూడా దారితీస్తాయి.

ఈ వస్తువులను తీసుకోవడం మానుకోండి..

పచ్చబొట్టు వేయబోతున్నట్లయితే కనీసం 48 గంటల ముందు ఎలాంటి ఆల్కహాల్ తాగకుండా ఉండాలి. ఎందుకంటే ఇది రక్తాన్ని పలచబరుస్తుంది. పచ్చబొట్టు వేసుకునే సమయంలో లేదా తర్వాత రక్తస్రావం సమస్యలను కలిగిస్తుంది. అలాగే కెఫీన్ ఉన్న పానీయాలను తీసుకోకుండా ఉండండి. ఎందుకంటే ఇది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. పచ్చబొట్టు వేసుకునేటప్పుడు మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. రక్తాన్ని పలచబరిచే మందులేవీ తీసుకోవద్దు.

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి..

మీరు పచ్చబొట్టు వేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే, దానికి కనీసం ఒక వారం ముందు రోజూ ఆరోగ్యకరమైన పానీయాలు తాగాలి. పుష్కలంగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఇది మీ చర్మాన్ని లోపలి నుండి తేమగా చేస్తుంది. ఇది మీ చర్మం టాటూ వేయించుకోవడానికి, సూది ఒత్తిడిని భరించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు పచ్చబొట్టు వేయించుకోవడానికి వెళ్ళే రోజున మీ ఆహారాన్ని సరిగ్గా తీసుకోవాలి. కడుపు నిండుగా ఉండాలి. అలా చేయని పక్షంలో నెర్వస్ నెస్, కళ్లు తిరగడం తదితర సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

సరైన బట్టలు వేసుకోవాలి..

పచ్చబొట్టు వేయించుకోవాలనుకుంటే వదులుగా, గాలి శరీరానికి తాకే దుస్తులను ధరించండి. దీంతో టాటూ వేయించుకునేటప్పుడు చెమటలు పట్టడం, నెర్వస్‌నెస్‌ వంటి సమస్యలు దరిచేరవు. అలాగే మీరు మీ కాలు మీద పచ్చబొట్టు వేయించుకోవాలనుకుంటే ఎలాంటి ఇబ్బంది కలగని దుస్తులను ధరించాలని గుర్తుంచుకోండి.

టాటూ వేయించుకున్న తర్వాత గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

పచ్చబొట్టు పూర్తయిన తర్వాత, మీరు ఇంటికి చేరుకునే వరకు శుభ్రమైన గుడ్డ లేదా టిష్యూతో కప్పి ఉంచాలి. సూర్యరశ్మికి గురికావడం వల్ల చర్మం ఎరుపు, దురద, వాపు, నొప్పి పెరుగుతుంది. అంతే కాకుండా దుమ్ము, మట్టి మొదలైన వాటి వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందనే భయం కూడా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత, కళాకారుడు సూచించిన ఏదైనా లిక్విడ్ లేదా యాంటీ బాక్టీరియల్ సబ్బుతో టాటూ వేసిన ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. మెల్లగా ఆరబెట్టాలి. అలాగే చర్మాన్ని తేమగా ఉంచండి. ఆ ప్రదేశంలో పదేపదే నీళ్లు పడకుండా చూసుకోవాలి. పచ్చబొట్టు ప్రాంతంలో రుద్దడం లేదా బిగుతుగా ఉండే బట్టలు ధరించవద్దు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News