వినాయక విగ్రహం పెడుతున్నరా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
దిశ, వెబ్‌డెస్క్ : వినాయక చవితి వచ్చేస్తుంది. ఇక వాడ వాడ సందడి మొదలు కానుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో సంబురంగా,
దిశ, వెబ్‌డెస్క్ : వినాయక చవితి వచ్చేస్తుంది. ఇక వాడ వాడ సందడి మొదలు కానుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో సంబురంగా, ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక సాయంత్రవ వేళలో కోలాటం, భజనలతో పది రోజు పల్లెల్లో పండుగ వాతావరణం చోటు చేసుకుంటుంది.
అయితే వినాయకుడి విగ్రహం పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు అధికారులు. ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుందాం.
1. వినాయకుడిని పెట్టే మండపాలకు సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి.
2. సౌండ్ పొల్యూషన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
3. మండపాలలో దీపారాధానల వలన అగ్నిప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.
4. వినాయకుడి విగ్రహం పెట్టే ప్రదేశం రోడ్డుకు దగ్గరిగా ఉండకూడదు.
5. వినాయక మండపాల ఏర్పాటుకు తప్పని సరిగా పోలీస్ స్టేషన్లో ఎస్‌హెచ్ అనుమతి తీసుకోవాలి