ఒట్టు... బాధను తగ్గించి బంధాన్ని దగ్గర చేస్తుందా?

ఏదైనా గొడవ జరిగినప్పుడు తమ నిజాయితీని నిరూపించుకునేందుకు లేదా ఆ పరిస్థితి నుంచి బయట పడేందుకు చాలా మంది ప్రమాణం చేస్తుంటారు. నా మీద ఒట్టు, నా తల్లిదండ్రులు, పిల్లల మీద ఒట్టు, ప్రమాణ పూర్తిగా చెప్తున్నా అంటూ ఎమోషనల్ అయిపోతారు. అయితే చాలా

Update: 2024-06-25 12:15 GMT

దిశ, ఫీచర్స్ : ఏదైనా గొడవ జరిగినప్పుడు తమ నిజాయితీని నిరూపించుకునేందుకు లేదా ఆ పరిస్థితి నుంచి బయట పడేందుకు చాలా మంది ప్రమాణం చేస్తుంటారు. నా మీద ఒట్టు, నా తల్లిదండ్రులు, పిల్లల మీద ఒట్టు, ప్రమాణ పూర్తిగా చెప్తున్నా అంటూ ఎమోషనల్ అయిపోతారు. అయితే చాలా మంది ఇలా ఒట్టు పెట్టడాన్ని చెడు అలవాటుగా పరిగణిస్తారు. కోపంలో దూకుడుతో ప్రమాణం చేస్తున్నారని అంటారు. కానీ ఇది వ్యక్తి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని అంటున్నారు నిపుణులు. ఒత్తిడిని మేనేజ్ చేసేందుకు హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు.

* పెయిన్ రిలీఫ్

ప్రమాణం అనేది హైపోఅల్జెసిక్ ఎఫెక్ట్ కలిగి ఉంది. అంటే నొప్పిని సున్నితంగా తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నొప్పి నివారిణిగా పని చేస్తుంది. 2009 అధ్యయనం ప్రకారం పదాలను ఉపయోగించకుండా ప్రమాణం చేసిన వారు ఎక్కువ సేపు పెయిన్ ఫీల్ అయ్యారని తేలింది.

* భావోద్వేగ నియంత్రణ

ప్రమాణం చేయడం ద్వారా నిరాశ లేదా కోపాన్ని వ్యక్తం చేయగలం. దీంతో మనసులో దాగి ఉన్న బాధ నుంచి బయటపడగలం. తీవ్రమైన భావోద్వేగాన్ని ఇలా పంచుకోవడం ద్వారా ఒత్తిడి స్థాయిలు, ఎమోషనల్ క్యాథర్సిస్‌లో తగ్గుదల ఉంటుంది. ఆసక్తికరంగా 2022 అధ్యయనం ప్రకారం చాలా మంది భాషల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తులు.. తమ మాతృ భాషలో ప్రమాణం చేసేందుకు ఇష్టపడుతారు. ఈ విధంగా తమ ఎమోషన్స్ ను రెగ్యులేట్ చేస్తారు.

* సెల్ఫ్ కాన్ఫిడెన్స్

ఒట్టు పెట్టడం ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎమోషన్స్ పాజిటివ్ గా మారిపోతాయి. ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంత్ పెరిగిపోతుంది. అప్పగించిన పనులు సులభంగా పూర్తి చేయగలరు.

* మేనేజింగ్ సోషల్ రిజెక్షన్

సామాజిక బంధాలకు ముప్పు ఏర్పడినప్పుడు ప్రమాణం చేయడం ద్వారా వాటిని కాపాడుకోవచ్చు. సోషల్ పెయిన్ నుంచి బయటపడొచ్చు. ఒట్టు రిజెక్షన్ ఫీలింగ్స్ ను మేనేజ్ చేస్తుంది. సోషల్ కనెక్షన్స్ ను బలంగా మారుస్తుంది. నిజాయితీని జోడించడం ద్వారా మనస్పర్థలు విచ్ఛిన్నం చేసి స్నేహ భావాన్ని ఏర్పరుస్తుంది.

పరిశోధనలు ఏం చెప్తున్నాయి?

* ప్రమాణం చేయని వారితో పోలిస్తే బిగ్గరగా ఒట్టు పెట్టిన వారు తక్కువ అసౌకర్యాన్ని అనుభవిస్తున్నారు.

* స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ఉన్నప్పుడు ఒట్టు పెట్టేందుకు ఊత పదాన్ని ఉపయోగిస్తారు.

* ప్రతిసారి ప్రమాణం చేయడం వల్ల సదరు వ్యక్తిని నమ్మే అవకాశం ఉండదు. ఒత్తిడితో కూడిన సంఘటనలు, నొప్పి నిర్వహణ సందర్భంలో మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది.

* ప్రమాణం చేసేందుకు సంస్కృతులు, సందర్భాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కొన్ని సంప్రదాయాలు ఒట్టును పరిగణిస్తే.. కొన్ని చాలా తప్పుగా భావిస్తాయి. మర్యాద లేనట్టుగా, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేనట్లుగా కనిపిస్తుంది కాబట్టి సదరు వ్యక్తులను నమ్మేందుకు ఆలోచిస్తారు.

* ఒట్టు పెట్టడం ద్వారా వ్యక్తిగత స్థాయిలు, సౌకర్యవంతమైన సంభాషణలు తగ్గవచ్చు. అందుకే ఇలా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.


Similar News