నెల నెలా వడ్డీ వచ్చే మస్త్ మంత్లీ స్కీం.. మిస్ కాకండి

పోస్ట్ ఆఫీస్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు రిస్క్ లేకుండా మంచి రాబడి పొందవచ్చు. దీనికోసం బెస్ట్ స్కీమ్స్‌లో ఒకటి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్.

Update: 2024-09-20 15:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టి మంచి రాబడి పొందాలని ఎవరికుండదు చెప్పండి. కానీ అలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఎక్కడ దొరుకుతాయో చాలాంమందికి తెలియక ఇబ్బంది పడుతుంటారు. అయితే పోస్ట్ ఆఫీస్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు రిస్క్ లేకుండా మంచి రాబడి పొందవచ్చు. దీనికోసం బెస్ట్ స్కీమ్స్‌లో ఒకటి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. ప్రతి పోస్ట్ ఆఫీస్‌లో మీకు ఈ రిస్క్ లేని ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే ప్రతి నెలా ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్‌గా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన మొదటి నెల నుంచే మీకు మంత్లీ ఇన్‌కం రావడం మొదలవుతుంది.

పోస్ట్ ఆఫీస్‌లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) అనే పెన్షన్ పథకం ఉంటుంది. ఈ స్కీమ్‌లో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా, మీరు రాబోయే 5 సంవత్సరాలలో ప్రతి నెలా కచ్చితమైన ఆదాయాన్ని పొందుతారు. సింగిల్, జాయింట్ ఖాతాల ద్వారా ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇక ఈ స్కీమ్‌ ద్వారా ఒకే ఖాతా ద్వారా గరిష్టంగా రూ.9 లక్షలు పెట్టుబడి, అలాగే ఉమ్మడి ఖాతా ద్వారా గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఈ మొత్తంపై మీకు 5 ఏళ్ల వరకు ప్రతి నెలా వడ్డీ రూపంలో కొంత మొత్తం వస్తూ ఉంటుంది.

ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4% వార్షిక వడ్డీని అందిస్తోంది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సంస్థ. అయితే, దాని వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారవచ్చు. ఈ విధంగా, మీరు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS)లో రూ. 9 లక్షలు డిపాజిట్ చేస్తే, 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 5,550 చొప్పున ప్రతి నెలా వడ్డీని పొందుతారు. అంటే 5 ఏళ్లలో రూ.3,33,000 రూపాయలను వడ్డీ రూపంలో మీరు పొందుతారన్నమాట. ఇది కాకుండా 5 ఏళ్లు పూర్తయిన తర్వాత మీ అసలు కూడా మీకు తిరిగి లభిస్తుంది. అదే ఒకవేళ జాయింట్ ఖాతా ద్వారా రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతి నెలా రూ. 9,250 వడ్డీ లభిస్తుంది. అంటే 5 ఏళ్లలో రూ.5,55,000 వడ్డీ రూపంలో లభిస్తుంది. ఇది కాకుండా గడువు తర్వాత మీ అసలు రూ.15 లక్షలు కూడా మీకు తిరిగొస్తుంది.

అదనపు ప్రయోజనాలు:

ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై మీకు ఎలాంటి ఆస్తి పన్ను ఉండదు. అలాగే టీడీఎస్ (TDS) లేదా పన్ను రాయితీ కూడా లభించదు. ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C పరిథిలోకి ఈ స్కీమ్ రాదు. అయితే మీ డిపాజిట్‌పై పొందే వడ్డీపై మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసినప్పుడు, ఈ వడ్డీని ‘ఇతర వనరుల నుండి వచ్చిన ఆదాయం’ కేటగిరీలో చూపించాల్సి ఉంటుంది.

నియమ నిబంధనలు:

ఈ పథకం కింద ఖాతాను తెరిచిన తర్వాత, ఓ సంవత్సరం పాటు డబ్బును విత్‌డ్రా చేయడానికి సాధ్యం కాదు. అలాగే, మీరు దాని మెచ్యూరిటీ వ్యవధి పూర్తయ్యేలోపు అంటే 3 నుండి 5 సంవత్సరాల మధ్య విత్‌డ్రా చేస్తే, అప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్‌లో 1 శాతం కట్ అవుతుంది.

అంటే.. కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయగలిగే స్థాయిలో ఉండి.. దాని నుంచి సాధారణ ఆదాయాన్ని కోరుకునే వారికి ఈ స్కీమ్ సరిగ్గా సరిపోతుందన్నమాట. ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్లకి, వయో వృద్ధులకి ఇది చాలా చక్కటి స్కీమ్‌లా పని చేస్తుంది. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్‌లో సంప్రదించండి.


Similar News