ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే గసగసాలు..!

గసగసాలు భారతీయ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే పదార్థాలలో ఒకటి.

Update: 2024-03-13 07:54 GMT

దిశ, ఫీచర్స్: గసగసాలు భారతీయ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే పదార్థాలలో ఒకటి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీని వినియోగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గసగసాలు తినడం వల్ల అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూద్దాం..

గుండె ఆరోగ్యం

గసగసాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యంగా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి . మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జీర్ణక్రియ

గసగసాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్దకాన్ని నివారించడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా, ఫైబర్ జీర్ణవ్యవస్థలోని ఆహారాన్ని సజాజంగా కదిలించడానికి పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది.

ఎముకలు

గసగసాలలో కాల్షియం, మెగ్నీషియం వంటి ఎముకలను బలపరిచే ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం ఎముక పదార్థంలో ప్రధాన భాగం, మెగ్నీషియం ఎముకల బలాన్ని పెంచడానికి, ఎముకల బలహీనతను నిరోధించడానికి సహాయపడుతుంది.


Similar News