ఒబేసిటీకి కారణమవుతున్న రసాయన కాలుష్యం.. తాజా అధ్యయనం
జంక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం, శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం ఊబకాయ సమస్యకు దారితీస్తుందని మనకు తెలిసిందే.
దిశ, ఫీచర్స్: జంక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం, శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం ఊబకాయ సమస్యకు దారితీస్తుందని మనకు తెలిసిందే. కానీ పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న కొన్ని రకాల కెమికల్స్ కూడా ఫుడ్ సర్కిల్‌లో భాగంగా మానవ శరీరంలోకి వెళ్తుండటంవల్ల కూడా ఒబేసిటీ సమస్య తలెత్తుతుందని తాజా అధ్యయనం పేర్కొన్నది. ముఖ్యంగా పాలిఫ్లోరినేటెడ్ సబ్ స్టైన్సెస్ (polyfluorinated substances) ఇందుకు కారణం అవుతున్నాయి. రసాయన కాలుష్యం భవిష్యత్తులో అనేక అనారోగ్యాలకు కారణం అయ్యే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రీసెర్చ్ జర్నల్‌లో పబ్లిషైన ఒక డానిష్ అధ్యయనం ప్రకారం.. నూనె వేడిచేసినప్పుడు, ఇంధనాలు కాల్చినప్పుడు, పరిశ్రమల్లో ఫుడ్ ప్యాకేజింగ్ కోసం వాడే కెమికల్స్ వంటి పాలిఫ్లోరినేటెడ్ సబ్ స్టయిన్స్‌ను పరిశోధకులు రసాయన కాలుష్యానికి కారణమయ్యే ‘forever chemicals’గా పేర్కొంటున్నారు. ఇవి పర్యావరణంలో సహజంగా విచ్ఛిన్నం అయ్యే పరిస్థితిలేని కారణంగా నీటిలో, మట్టిలో, పర్యావరణంలో కలిసి ఉండటంవల్ల కూడా ఫుడ్ సర్కిల్‌లోకి ప్రవేశించి ఒబేసిటీకి కారణం అవుతున్నాయట.
1940 నుంచి బట్టలు మొదలు ఫుడ్ ప్యాకేజింగ్ వరకు వివిధ కెమికల్స్ యూజ్ చేయడం పరిపాటిగా మారింది. ఇప్పుడా పరిస్థితి ఆరోగ్య సమస్యలకు కారణం అవుతోంది. పాలిఫ్లోరినేటెడ్ సబ్ స్టైన్సెస్ వల్ల క్యాన్సర్‌తో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. కొన్ని ఆమోదించబడిన కెమికల్స్ కూడా ప్యాకేజింగ్ నుంచి మనం తినే ఆహార పదార్థాల్లోకి లీక్ అవుతున్నాయని డెన్మార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్, అలాగే యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగన్ శాస్త్రవేత్తలు కలిసి నిర్ధారించారు. అందుకోసం వారు 2011 నుంచి వివిధ ఆహారాలు, హృదయ నాళాల మధ్య సంబంధంపై నిర్వహించిన అధ్యయనానికి సంబంధించిన డేటాను కూడా ఉపయోగించారు.
తాజా అధ్యయనంలో భాగంగా బల్గేరియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, జర్మనీ, గ్రీస్, నెదర్లాండ్స్, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి 8 యూరోపియన్ దేశాల నుంచి ఒబేసిటీ సమస్య తగ్గుదల క్రమంలో ఉన్న 381 మందిని 26 వారాలపాటు స్టడీ చేసి నిర్ధారణకు వచ్చారు. కెమికల్స్ కలిసిన ఆహార పదార్థాలు తీసుకోవడంవల్ల వారిలో ప్రతీ ఒక్కరు 1.5 కిలోల బరువు పెరగడంతోపాటు ఎక్కువగా ఊబకాయానికి గురయ్యారని కనుగొన్నారు. ఒబేసిటీ సమస్య ఇప్పటికే ఐరోపాలో దేశాల్లో ప్రతీ సంవత్సరం 1.2 మిలియన్ల మరణాలకు కారణమవుతోందని నిపుణులు పేర్కొన్నారు.
Read more: