20 నిమిషాలు SEX చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఈ సమస్య పురుషులతో మరింత అధ్వాన్నంగా ఉంటుంది. Physically being able to have sex is also an indication good health.
దిశ, వెబ్‌డెస్క్ః ఈ ఏడాది జనవరిలో 'ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్'లో ప్రచురించిన ఒక అధ్యయనం సెక్స్‌కి, శారీరక, మానసిక ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని వివరించింది. దీని ప్రకారం, లాక్‌డౌన్ సమయంలో లైంగిక సంబంధం కొనసాగించే వ్యక్తులు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం 34 శాతం తక్కువని తెలిసింది. దీనితో పాటు, కొంతమంది నిపుణులు సెక్స్ అనేది సాధారణ ఆరోగ్యానికి కీలకమైన బేరోమీటర్ అని నమ్ముతారు. అయితే, దీన్ని నిర్ధారించుకోవడం కోసం వైద్యులు వారి రోగులతో విస్తృతంగా చర్చించాల్సి ఉంటుంది. కానీ, రోగుల లైంగిక కార్యకలాపాల గురించి చాలా అరుదుగా అడుగుతారు.
ఆస్టన్ యూనివర్శిటీలో యూరాలజిస్ట్, పురుషుల ఆరోగ్యంపై పనిచేస్తున్న ప్రొఫెసర్ జెఫ్రీ హాకెట్ దీనికి సంబంధించి తన అనుభవాన్ని చెబుతూ, "ఒక వైద్యుడిగా, మహిళలను వారి రుతు చక్రం గురించి అడగడంలో సంకోచించాల్సిన అవసరం ఉండదు. అయితే, మహిళల లైంగిక కార్యకలాపాలపై చాలా అరుదుగా చర్చిస్తాము. ఇక, ఈ సమస్య పురుషులతో మరింత అధ్వాన్నంగా ఉంటుంది. అయినప్పటికీ, ఒక వ్యక్తికి క్రమం తప్పకుండా అంగస్తంభనలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం అతని ఆరోగ్యం గురించి చాలా విషయాలను వెల్లడిస్తాయి" అని అంటారు.
అంగస్తంభనను పొందలేకపోవడం అనేక కారణాల వల్ల సంభవిస్తుంది. ముఖ్యంగా, పురుషాంగానికి సరఫరా అయ్యే ధమనులకు ఆటంకం కలగడం వల్ల కూడా కావచ్చు. అయితే, శారీరకంగా సెక్స్ చేయగలిగే సామర్థ్యం కూడా ఒక నిర్దిష్ట స్థాయిలో ఫిట్‌నెస్‌కు సూచనగా అనుకోవాలని నిపుణులు భావిస్తున్నారు. ఇక, "మనిషిలో 20 నిమిషాల లైంగిక కార్యకలాపాలు ఒక మైలు దూరం నడకతో సమానమని, ఇలా మీరు సెక్స్‌ను తరచుగా చేస్తే అది సహేతుకమైన శారీరక శ్రమ అవుతుంది" అని ప్రొఫెసర్ హాకెట్ అంటారు.