100 బొద్దింకలను ఇంట్లోకి అనుమతిస్తే.. రూ. లక్షన్నర మీదే!
దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఇంటి పరిసరాలు లేదా కిచెన్ సింక్‌లో బొద్దింకలు ఉండటం సహజం. అయితే అవి కనిపించిన వెంటనే ‘కాక్రోచ్ కిల్లర్ స్ప్రే’ లేదా వివిధ పద్ధతులు ఉపయోగించి చంపేస్తుంటాం..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఇంటి పరిసరాలు లేదా కిచెన్ సింక్‌లో బొద్దింకలు ఉండటం సహజం. అయితే అవి కనిపించిన వెంటనే 'కాక్రోచ్ కిల్లర్ స్ప్రే' లేదా వివిధ పద్ధతులు ఉపయోగించి చంపేస్తుంటాం. కానీ ఓ కంపెనీ మాత్రం ఎవరైనా తమ ఇంట్లోకి 100 బొద్దింకలను విడిచిపెట్టేందుకు అనుమతిస్తే ఆయా గృహ యజమానులకు రూ. లక్షా యాభై ఆరువేలు($2,000) చెల్లిస్తామని ప్రకటించింది. సదరు కంపెనీ ఈ ఆఫర్ ఇవ్వడానికి గల కారణమేంటంటే?
అమెరికాకు చెందిన పెస్ట్ కంట్రోల్ కంపెనీ 'రాలీ'.. ప్రాక్టికల్‌గా బొద్దింకలను నిర్మూలించే పద్ధతిని పరీక్షించాలని చూస్తోంది. ఈ మేరకు గృహ యజమానులు 100 బొద్దింకలను తమ ఇళ్లల్లో విడిచిపెట్టేందుకు అంగీకరిస్తే రూ. లక్షన్నర చెల్లిస్తామని వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఎవరైనా ఈ ప్రయోగాత్మక ప్రోగ్రామ్ కోసం ఒప్పుకుంటే 'ది పెస్ట్ ఇన్‌ఫార్మర్(The Pest Informer)' వెబ్‌సైట్‌కు సైన్‌అప్ చేయాల్సిందిగా కోరుతోంది. ఇందుకోసం ఒక ఒప్పందంతో పాటు సాంకేతిక నిపుణుల ద్వారా మొత్తం ప్రయోగాన్ని చిత్రీకరించేందుకు ఇంటి యజమాని రాతపూర్వక ఆమోదం అవసరమని పేర్కొంది. ఇది మొత్తంగా 30 రోజుల పాటు బొద్దింకలన్నింటినీ నిర్మూలించేందుకు ప్రయత్నిస్తుంది. ఒకవేల అంగీకరించిన 30 రోజుల తర్వాత కూడా బొద్దింకలు మీ ఇంట్లో ఉంటే.. కంపెనీ $2,000 చెల్లించడం సహా ఇంట్లో బొద్దింకలు లేకుండా నిర్మూలించేందుకు ఇతర నిర్మూలనా పద్ధతులను ఉపయోగిస్తుంది.
'ది పెస్ట్ ఇన్‌ఫార్మర్' వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ఆఫర్ కోసం ఇప్పటికే 2,200 దరఖాస్తులు అందాయి. అప్లికేషన్ పేజీ జులై 31 వరకు తెరిచి ఉండనుండగా కంపెనీ మాత్రం కేవలం 5 నుంచి 7 ఇళ్లకు మాత్రమే ఈ ఆఫర్ ప్రకటించనుంది.