Periods: పీరియడ్స్ రెగ్యులర్‌గా రావట్లేదా.. దీనికే సంకేతమని ఇలా గుర్తించండి.. స్పష్టమైన ఈ మార్పులతో

పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోతే ప్రగ్రెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు.

Update: 2024-10-04 15:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోతే ప్రగ్రెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. పీరియడ్స్ రావాల్సిన సమయం కన్నా కాస్త రెండు, మూడు రోజులు లేట్ అయితేనే పెళ్లైన మహిళలకు సందేహాలు తలెత్తుతాయి. అయితే అలాంటి సందేహాలు ఏం లేకుండా తప్పకుండా ప్రెగ్నెన్సీ అని నిర్ధారించే ఈ లక్షణాలతో ఈజీగా గమనించండి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

తీవ్రమైన అలసట..

రొమ్ముల్లో సున్నితవ్వం ప్రెగ్నెన్సీ లక్షణాలను సూచించడంలో ఒకటి. చెస్ట్ ఉబ్బినట్లుగా ఉండడం, అలాగే తలనొప్పి రావడం కూడా. అలాగే ప్రెగ్నెన్సీలో ప్రొజెస్టిరాన్ లెవల్స్ పెరగడం వల్ల విపరీతంగా అలసిపోతారు. దీంతో చాలా వీక్ అయితారు. పైగా రాత్రంతా నిద్ర పట్టదు. మార్నింగ్ మార్నింగే వాంతులు అవుతాయి.

మూడ్ స్వింగ్స్ మారుతాయి..

వాంతులతో పాటు కళ్లు తిరుగుతాయి. కొంతమందికి కేవలం ఉదయమే కాకుండ రోజులో ఎప్పుడైనా వాంతులు అవ్వొచ్చు. మూడ్ స్వింగ్స్ మారుతుంటాయి. హార్మోన్లలో మార్పుల కారణంగా మానసికంగా ప్రభావం చూపుతుంది. దీంతో ప్రెగ్రెన్సీ సమయంలో భావోద్వేగాలు అదుపులో ఉండవు.

పదే పదే మూత్రానికి వెళ్లాలనిపించడం.. 

తరచూ మూత్తానికి వెళ్లాలనిపించడం, కొత్తగా ఏదైనా ఫుడ్ తినాలనిపించడం, కొన్ని సార్లు వికారంగా అనిపించడం జరుగుతుంది. హార్మోన్లలో మార్పులు కారణంగా జీర్ణక్రియపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీంతో జీర్ణక్రియ మందగిస్తుంది. తద్వారా మలబద్దకం, బ్లోటింగ్ వచ్చే సమస్యలు తలెత్తుతాయని గైనకాలజిస్ట్ చెబుతున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Read More : కోమాలో ఉన్న పేషెంట్స్‌కు పీరియడ్స్ వస్తాయా? 


Similar News