PERIODS: పీరియడ్స్ సమయంలో తలస్నానం చేయొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

సాధారణంగా ప్రతి నెల అమ్మాయిలకు పీరియడ్స్ రావడం సహజం.

Update: 2024-08-29 08:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ప్రతి నెల అమ్మాయిలకు పీరియడ్స్ రావడం సహజం. అయితే చాలా మంది పీరియడ్స్ వచ్చిన రోజు, 3వ రోజు, 5వ రోజు అని తలస్నానాలు చేస్తారు. మరికొంత మంది స్టార్టింగ్ డే అండ్ ఎండింగ్ డే తలస్నానం చేస్తారు. మరి ఈ సమయంలో హెడ్‌బాత్ చేయోచ్చా లేదా ఒకవేళ చేస్తే కలిగే లాభాలు, నష్టాల గురించి నిపుణులు ఏం చెపుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

*పీరియడ్స్ సమయంలో తలస్నానం చేయడం వల్ల మహిళలు వంధ్యత్వానికి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

*అలాగే పీరియడ్స్ సమయంలో చాలా చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీంతో కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో తలస్నానం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

*కొన్ని కొన్ని సార్లు తప్పని పరిస్థితిలో చేయాల్సి వస్తే మాత్రం చల్లని నీటికి బదులుగా గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలని చెబుతున్నారు. ఎందుకంటే గోరువెచ్చని నీరు శరీరానికి విశ్రాంతిని ఇస్తుందట.

*అదేవిధంగా పీరియడ్స్ సమయంలో తలస్నానం చేయడం నిషిద్ధం. ఎందుకంటే ఈ సమయంలో తలస్నానం చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత మారుతుందని. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని అంటున్నారు నిపుణులు.

*అయితే పీరియడ్స్ అయిపోయిన తర్వాత మాత్రం కచ్చితంగా తలస్నానం చేయాలని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పీరియడ్స్ సమయంలో శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు ఉత్పత్తి అవుతాయి. అందుకే పీరియడ్స్ తర్వాత శరీరంతో పాటు జుట్టును కూడా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు.

*నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.


Similar News