ట్రాఫిక్‌లో ఆగ్రహంతో ఊగిపోతున్నారా? ఈ కారు ఫ్రెష్‌నర్‌తో సొల్యూషన్

రోడ్డు మీదకు వెళ్లినప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్నారా? ట్రాఫిక్‌లో ఊరికే ఎదుటివాళ్లపై అరుస్తున్నారా? సడెన్‌గా బ్రేక్ వేయడం, పార్టిసిపెంట్‌ లేన్ లోకి వెళ్లడం చేస్తున్నారా? దీన్నే ‘రోడ్ రేజ్’ అని పిలుస్తుంటారు.

Update: 2023-04-06 10:18 GMT

దిశ, ఫీచర్స్: రోడ్డు మీదకు వెళ్లినప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్నారా? ట్రాఫిక్‌లో ఊరికే ఎదుటివాళ్లపై అరుస్తున్నారా? సడెన్‌గా బ్రేక్ వేయడం, పార్టిసిపెంట్‌ లేన్ లోకి వెళ్లడం చేస్తున్నారా? దీన్నే ‘రోడ్ రేజ్’ అని పిలుస్తుంటారు. ఒత్తిడిలో ఇలా దూకుడుగా ప్రవర్తిస్తుండగా.. దీన్ని తగ్గించేందుకు బెస్ట్ ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌ కనుగొన్నారు పరిశోధకులు. పెప్పర్‌మింట్ ఆయిల్ సువాసన ఇలాంటి ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుందని గుర్తించారు.

డ్రైవింగ్ సిమ్యులేషన్ కోసం వర్చువల్ రియాలిటీ (VR) వినియోగాన్ని పరిశోధించడంలో భాగంగా UK విశ్వవిద్యాలయం నుంచి యాభై మంది విద్యార్థులను అధ్యయనం కోసం నియమించారు. పరిశోధకులు దూకుడును ప్రేరేపించగల 15 నిమిషాల డ్రైవింగ్ అనుభవానికి అనుకరణను పెంచారు. వారి డ్రైవింగ్ ప్రవర్తన దూకుడుగా మారినప్పుడు సాఫ్ట్‌వేర్ రికార్డ్ చేయబడింది. పెప్పర్‌మింట్ ఆయిల్ గ్రూప్‌లోని వారు సగటున 21.6 రెట్లు దూకుడు డ్రైవింగ్ ప్రవర్తనను చూపిస్తే.. నియంత్రణ సమూహంలో ఉన్నవారు 25.2 రెట్లు దూకుడుగా ఉన్నారు అంటే సగటున 16.7 శాతం పెరుగుదల. సువాసనకు గురైన వారు మరింత అప్రమత్తంగా, ప్రశాంతంగా ఉన్నారని.. అలాగే నియంత్రణ సమూహంలో ఉన్నవారి కంటే తక్కువ దూకుడుగా, ఒత్తిడికి గురయ్యారని పరిశోధకులు కనుగొన్నారు. దీని అర్థం సుగంధం దూకుడు డ్రైవింగ్ ప్రవర్తనలను గణనీయంగా తగ్గించింది. ఎసెన్షియల్ ఆయిల్‌లోని సమ్మేళనాలు మెదడుపై యాంటీ-డిప్రెసెంట్, యాంటీ-యాంగ్జయిటీ ప్రభావాలను కలిగి ఉండటం మూలంగా ఇలా జరుగుతుందని తేలింది.   

Read more :

ఎండకాలం టైర్లు పంక్చర్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? 

Tags:    

Similar News