యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వారు ఈ పండ్లను తినకండి?

సాధారణంగా రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడమనేది పెద్ద సమస్య.

Update: 2023-10-25 14:31 GMT

దిశ,వెబ్ డెస్క్: సాధారణంగా రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడమనేది పెద్ద సమస్య. శరీరంలో ఇది పెరిగితే అధిక రక్తపోటు, ఊబకాయం, ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి శరీరంలో దీని పెరుగుదలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య ఉత్పన్నం అవుతుంటే, కొన్ని పండ్లను తినకూడదని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ పండ్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

యూరిక్ యాసిడ్ స్థాయిలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు చక్కెర ఉండే ఈ పండ్లను తినకుండా ఉంటేనే మంచిది. ఈ సమస్య సమస్య ఉన్నవారు సపోటా లను తినకూడదు. ఎందుకంటే.. దీనిలో ఫ్రక్టోజ్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకోకండి. పైనాపిల్లో అధిక మొత్తంలో ఫ్రక్టోజ్ ఉంటుంది కాబట్టి ఇది తీసుకుంటే హానికరంగా మారుతుంది. రేగుపండ్లను కూడా దూరం పెట్టండి. ఇక యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు అరటిపండు, అవకాడో, బెర్రీలు వంటి కొన్ని పండ్లను తినవచ్చు. అయితే ఏదైనా అధిక మొత్తంలో ఏ పండునైనా తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు.

Tags:    

Similar News