Eating Mistakes: అలర్జీ బారిన పడటానికి ముఖ్య కారణం..!
తరచుగా వాపు, ఎరుపు, పొక్కులు,దద్దుర్లు వంటివి అలర్జీ లక్షణాలు.
దిశ, వెబ్‌డెస్క్: తరచుగా వాపు, ఎరుపు, పొక్కులు,దద్దుర్లు వంటివి అలర్జీ లక్షణాలు. కొన్నిసార్లు ఆహారం కారణంగా అలర్జీ వస్తే.. మరికొన్ని సార్లు వాటర్ ప్రాబ్లమ్ లేదా ఇతర కారణాల వల్ల వస్తుంటుంది. అయితే తాజాగా చిరుతిండి అయినా వేరు శనగల కారణంగా కూడా అలర్జీ లేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సమయం తెలియకుండా ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు వేసుకుంటూ పల్లికాయ తింటుంటారు. వేరుశనగలు చలికాలంలో ఎక్కువగా దొరుకుతాయి. కాగా చాలా మంది ఉడికించుకుని కూడా తింటుంటారు. రుచితో పాటు పల్లీల ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు. అయితే బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కొన్ని చిరు తిండులు హాని కూడా తలపిస్తాయి. అయితే ఇవి తిన్నాక ఈ మిస్టేక్స్ చేయొద్దంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
వాటర్ తాగుతున్నారా..
వేరుశనగలు తిన్నాక.. వెంటనే వాటర్ తాగకూడదు. ఇవి తిన్నాక నీరు తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా బ్లోటింగ్, గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. కాగా పల్లి తిన్న అనంతరం ముప్పై నిమిషాలయ్యాక నీరు తీసుకోవాలి.
ఐస్ క్రీమ్ తిన్నారంటే..
పల్లీ తిన్నాక ఐస్ క్రీమ్ తింటే గొంతు నొప్పి, చికాకు లాంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా గొంతులో కఫం పేరుకుపోతుంది. కాగా కాస్త సమయం తీసుకుని వాటర్ తాగాలి.
సిట్రస్ ఫ్రూట్స్..
చిక్కీ తిన్నాక వెంటనే నిమ్మ, కివి, సిట్రస్ ద్రాక్ష, నారింజ వంటి ఫ్రూట్స్ తినకూడదంటున్నారు నిపుణులు. ఇవి తింటే దగ్గు, గొంతునొప్పి, చికాకు వంటి సమస్యలతో పాటుగా అలర్జీ వస్తుంది.
నువ్వులు, చిక్కుళ్లు..
వేరుశెనగ తిన్నాక నువ్వులు, చిక్కుళ్లు తింటే అలర్జీ వస్తుంది. ముఖ్యంగా సున్నితత్వం కలిగిన అలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు అస్సలు తినకూడదు. అలాగే వాటర్ కూడా గంట తర్వాత తీసుకోవాలి.
చాక్టెట్లు..
చాక్లెట్స్ లవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అక్కర్లేదు. కానీ చాక్లెట్స్ ఆరోగ్యానికి మంచివి కాదని తరచూ నిపుణులు చెబుతున్నారు. కాగా వేరుశెనగ తిన్నాక చాక్లెట్స్ తింటే అలర్జీ సమస్య తలెత్తుతుంది.