కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు వీటిని అసలు తినకూడదు!
కొన్ని ఆహారాలు కిడ్నీలో రాళ్లను కలిగిస్తాయి.
దిశ,ఫీచర్స్: కొన్ని ఆహారాలు కిడ్నీలో రాళ్లను కలిగిస్తాయి. వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన ఆహారాలలో సలాడ్ ఒకటి. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుమ్మడి గింజలు కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ పదార్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. టమోటాలు, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయలు తినడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
2. కూరగాయలు కాకుండా కొన్ని పండ్లు తినడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
3. సపోటా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
4. పుట్టగొడుగులను తినడానికి చాలా మంది ఇష్ట పడతారు. అయితే, కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకూడదు.
5. కిడ్నీ వ్యాధి ఉన్నవారు ఉసిరికాయ, దోసకాయ, బెండకాయ, క్యాబేజీకి దూరంగా ఉండటం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
6. వేయించిన చికెన్, సాల్టెడ్ నట్స్ వంటి సోడియం అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి.
7. శీతల పానీయాలను కూడా దూరం పెట్టాలి.
8. పిజ్జా, బర్గర్‌లు, శాండ్‌విచ్‌లు వంటి ఫాస్ట్ ఫుడ్‌లు కూడా కిడ్నీలో రాళ్లను కలిగిస్తాయి.
9. చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.
10. చిప్స్ , గింజలు అధికంగా ఉండే ఆహారాలను తినడం ఈ రాళ్లు ఏర్పడతాయి..
11. చాక్లెట్లు కూడా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.