Pear Fruit : బేరి పండు యొక్క ప్రయోజనాలివే!
బేరి పండులో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది.
దిశ, వెబ్ డెస్క్ : బేరి పండులో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. ఈ పండ్లు ఒక్క సీజన్లో మాత్రమే మనకి లభిస్తాయి.మన శరీరానికి అధికమైన మేలును కలుగజేస్తుంది. బేరి పండులో ఫైబర్ ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలకు చెక్ పెడుతుంది. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు కూడా ఈ పండును తినవచ్చు. ఈ పండు యొక్క ప్రయోజనాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
1. ఇందులో ఐరన్, రిబోఫ్లావిన్ , కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్ మరియు విటమిన్ బి6 వంటి పోషకాలు కలిగి ఉంటుంది.
2. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
3. క్యాన్సర్ నిరోధక శక్తిగా కూడా పని చేస్తుంది.
4. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
5. జీర్ణక్రియను మెరుగుపరచే గుణాలు ఉన్నాయి.
6. బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది.
7. రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది.
8. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.