తల్లిదండ్రులు అలర్ట్.. ఆడపిల్లల విషయంలో తెలిసి ఈ తప్పులు చేయొద్దు!

ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆడ పిల్లలు దూసుకుపోతున్నారు.

Update: 2024-03-11 14:39 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆడ పిల్లలు దూసుకుపోతున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల వివక్ష పోలేదు. కొంత మంది పేరెంట్స్ మగ, ఆడ పిల్లలు కలిగి ఉండే ఇద్దరిని సమానంగా చూడటం, చదివించడం లాంటివి చేస్తుంటారు. కానీ, మరికొంత మంది తల్లిదండ్రులు మాత్రం ఆడ, మగ అనే భేదం చూపించి తప్పులు చేస్తున్నారు. మగ పిల్లలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ అమ్మాయిలకు ఇవ్వడం లేదు. దీంతో అమ్మాయిల్లో వెనకబడిపోవడం, అభద్రతా భావాలకు గురికావడం జరుగుతోంది. అసలు పేరెంట్స్ ఆడపిల్లను ఎలా పెంచాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

డిఫరెన్స్:

పేరెంట్స్ గుర్తించుకోవాల్సిl అతి ముఖ్యమైన అంశం భేదం. కొడుకులు, కూతుళ్ల మధ్య వ్యత్యాసం చూపిస్తూ వారిని పెండచకూడదు. కానీ చాలా మంది తల్లిదండ్రులు ఇదే తప్పును చేస్తున్నారు. అది మొదటికే మోసం అవుతుంది. ఇలా లింగ భేదం చూపించడం కారణంగా అమ్మాయిలల్లో మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం చాలా ఉంది. కాబట్టి తల్లిదండ్రులు మగ, ఆడ పిల్లలను సమానంగా పెంచాలి.

ఆంక్షలు:

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఘోరాల కారణంగా చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లల విషయంలో చాలా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో వారికి ఆంక్షలు విధిస్తున్నారు. స్కూలుకి ఎలా వెళ్లాలి, ఇంటికి ఎలా రావాలి, ఏం చెయ్యాలి, ఎలాంటి బట్టలు ధరించాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అలా చెయ్యకూడదు, ఇలా చెయ్యకూడదు, ఎక్కువగా నవ్వకూడదు ఇలాంటివి ఎన్నో ఆంక్షలు వారికి విధిస్తున్నారు. వీటి ప్రభావం వారి ఎదుగుదలపై, మానసిక ఒత్తిడిపై పడుతోంది. కాబట్టి.. ఆడపిల్లలకు ఆంక్షలు కాకుండా ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పించండి. ఎటువంటి పరిస్థితినైనా తమ తెలివితేటలతో తప్పించుకునేలా వారిని తయారు చెయ్యండి. ఇలా చెయ్యడం వల్ల ఎటువంటి కష్ట పరిస్థితి ఎదురైన వాటిని ఎదురించి జీవితంలో ముందుకు వెళ్లగలుగారు.

స్వేచ్ఛ/ధైర్యం

ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు వారికి ఏం కావాలన్న స్వేచ్ఛగా అడగలేక పోతున్నారు. వారికి ఏదైనా జరిగిన ధైర్యంగా చెప్పలేక పోతున్నారు. ఆడపిల్లకు వారి స్కూళు ఏజ్ నుంచే తల్లిదండ్రులు వారితో మాట్లాడే ప్రయత్నం చెయ్యండి. అసభ్యకరంగా ఎవరైన ప్రవర్తించారా అనేవి తెలుసుకోండి. సమాజంలో జరిగే చెడు పనుల గురించి వారికి అవగాహాన కల్పించండి. దీని వల్ల వారు మీతో అన్ని చెప్పుకోవడానికి అలవాటు పడతారు. అలాగే అలాంటి సమయాల్లో ఎలా ప్రవర్తించాలో చిన్నప్పటి నుంచే ఆడపిల్లలకు ధైర్యాన్ని నింపాలి. లేదంటే పెద్దయ్యాక కూడా గృహహింస, వేధింపుల అనుభవిస్తున్నా సరే భయటకు చెప్పుకునే ధైర్యం లేక చెప్పుకోలేరు. కొన్ని సార్లు ధైర్యం లేకపోవడం ఆడపిల్లల ప్రాణాలు సైతం బలి తీసుకుంటుందని పేరెంట్స్ గుర్తించుకోవాలి.


Similar News