గర్భిణీ స్త్రీలపై బొప్పాయి సైడ్ ఎఫెక్ట్స్

గర్భిణీ స్త్రీలు బొప్పాయి తీసుకోవచ్చా లేదా అనే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. పండిన పాపాయ తీసుకున్నా మంచిదే కానీ పండనిది తీసుకుంటే మాత్రం ప్రాణాంతకం

Update: 2024-06-22 13:17 GMT

దిశ, ఫీచర్స్: గర్భిణీ స్త్రీలు బొప్పాయి తీసుకోవచ్చా లేదా అనే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. పండిన పాపాయ తీసుకున్నా మంచిదే కానీ పండనిది తీసుకుంటే మాత్రం ప్రాణాంతకం కావచ్చని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇంతకీ పచ్చి బొప్పాయి వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

* పచ్చి బొప్పాయిలో ఉండే రబ్బరు పాలు (లేటెక్స్) గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది. ఒక్కోసారి గర్భస్రావం జరిగే నెలకొంటుంది.

* పండని బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ పిండానికి మద్దతు ఇచ్చే పొరను బలహీనపరుస్తుంది. నెలలు నిండక ముందే ప్రసవం జరిగేందుకు కారణం అవుతుంది. బిడ్డ ఎదగకముందే డెలివరీ అవడం వల్ల పిల్లల్లో చిన్నప్పటి నుంచే అనేక అనారోగ్య సమస్యలు వెంటాడతాయి.

* పపైన్ ఎంజైమ్ రక్తనాళాలను విస్తరిస్తుంది. రక్తస్రావాన్ని నియంత్రించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రసవం సమయంలో అధిక రక్తస్రావానికి దారితీస్తుంది. తద్వారా రక్తహీనత ఏర్పడుతుంది.


Similar News