Paneer Tikki Chaat: నవరాత్రుల్లో రోజంతా శక్తినిచ్చే రుచికరమైన స్నాక్..!!

ఉపవాసం ఉన్నప్పుడు రోజంతా శక్తినిచ్చే స్నాన్ కోసం పన్నీర్ టిక్కి చాట్ బెస్ట్ ఆప్ఫన్ గా చెప్పుకోవచ్చు.

Update: 2024-10-05 10:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉపవాసం ఉన్నప్పుడు రోజంతా శక్తినిచ్చే స్నాన్ కోసం పన్నీర్ టిక్కి చాట్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. పైగా ఇప్పుడు నవరాత్రుల్లో చాలా రకాలుగా చాలా మంది ఉపవాసం ఉంటారు. కొంతమంది తొమ్మది రోజులు కేవలం ఫ్రూట్స్ మాత్రమే తింటారు. భోజనం చేయరు. మరికొంతమంది రోజంతా ఉపవాసం ఉండి.. రాత్రి మాత్రమే భోజనం చేస్తారు. కాగా హైప్రోటీన్,హెల్తీ స్నాక్ పన్నీర్ టిక్కి చాట్‌ను ఉపవాసంలో తింటే రోజంతా ఫుల్ ఎనర్జీగా ఉంటారు. అదేలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

పన్నీర్ టిక్కి చాట్ కోసం కావలసిన పదార్థాలు..

200 గ్రాముల పనీర్, సరిపడ పెరుగు,గ్రీన్ చట్నీ, పచ్చిమిర్చి, రెండు ఉడకబెట్టిన బంగాళాదుంపలు, అర చెంచా వేయించిన జీలకర్ర పొడి, దానిమ్మ గింజలు- గుప్పెడు, మిరియాల పొడి, బటర్ లేదా నెయ్యి, నల్ల ఉప్పు, ఆయిల్ లో వేయించిన వేరుశెనగలు తీసుకోవాలి.

పన్నీర్ టిక్కి చాట్ తయారీ విధానం..

బంగాళాదుంపల్ని ఉడికించి గుజ్జుగా చేసి.. అందులో సాల్ట్, పన్నీర్ వేసి కలపాలి. దీన్ని చేతుల మధ్య పెట్టి టీక్కీలాగా ఒత్తి.. ప్యాన్ పై బటర్ వేసి కాల్చాలి. క్రిస్పీగా అయ్యాక ఒక బౌల్ లోకి తీసుకుని పెరుగు, కాస్త పంచదార, గ్నీన్ చట్నీ, దానిమ్మ గింజలు, ఉప్పు, మిరియాల పొడి, వేరుశనగలతో గార్నిష్ చేసుకోండి. ఇక పన్నీర్ టిక్కి చాట్ తయారీ అయిపోయినట్లే.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News