Health : ఈ సమస్యలు ఉన్నవారు పన్నీరు తింటున్నారా.. వెంటనే మానేయాల్సిందే..
ఇంట్లో పార్టీ ఉన్నా లేదా ఏదైనా స్పెషల్ తినాలన్నా ముందుగా గుర్తుకువచ్చేది పనీర్‌తో చేసిన అనేక రకాల వంటకాలు.
దిశ, ఫీచర్స్ : ఇంట్లో పార్టీ ఉన్నా లేదా ఏదైనా స్పెషల్ తినాలన్నా ముందుగా గుర్తుకువచ్చేది పనీర్‌తో చేసిన అనేక రకాల వంటకాలు. అనేక ఇండియన్ ఫ్యామిలీలో పనీర్ ఐటమ్స్ కు మంచి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇందులో క్యాల్షియం, సెలీనియం, ఫాస్పరస్, అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఎముకలు బలపడతాయి.
ఇక పోతే ఎలాంటి అనారోగ్య సమస్య లేని వారు ప్రతిరోజు పన్నీర్ తినడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని తినడం వలన మరింత అనారోగ్యం పాలవ్వక తప్పదంటున్నారు నిపుణులు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తపోటు సమస్య..
అధిక రక్తపోటు కోసం క్రమం తప్పకుండా మందులు వేసుకునే వారు పన్నీర్ ను ఆచితూచి తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఎక్కువశాతంలో కొవ్వు ఉంటుంది. దీని అధికంగా వినియోగించడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాలు మూసుకుపోయి బీపీ పెరుగుతుంది.
జీర్ణ సమస్యలు..
కడుపులో సుఖం లేని వారు, కాస్త ఆహారాన్ని కూడా జీర్ణించుకోలేని వారు పన్నీర్ వంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఇది సులభంగా జీర్ణం కాదు. ముఖ్యంగా అలాంటి వారు రాత్రి పడుకునే ముందు పన్నీర్ తినకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.
అలెర్జీ రోగులు..
పాలు లేదా ఏదైనా పాల ఉత్పత్తి తింటే అలెర్జీ ఉన్నవారు పన్నీర్ ను కూడా తినకూడదంటున్నారు నిపుణులు. ఈ వ్యక్తులు పొరపాటున తిన్నారంటే చర్మం పై దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురవుతారు.
తీవ్రమైన అతిసారం..
విరేచనాలు అవుతున్నప్పుడు పన్నీర్ తినవద్దు. పూర్తిగా మానేయాలని కాదు కానీ ఎక్కువగా తినడం వల్ల డయేరియా సమస్య మరింత తీవ్రమవుతుంది. తీవ్రమైన విరేచనాలు శరీరంలో నిర్జలీకరణానికి కారణమవుతాయి.
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.