టిక్‌టాక్ వీడియో కోసం ఇలా చేసిన పాకిస్థానీ యువతి.. ఆ వగలు బుగ్గిపాలు!
ఆమెను నిషేధించాలని, శిక్షించాలని అభ్యర్థిస్తున్నారు. Humaira Asghar faces backlash for posing by forest fire.
దిశ, వెబ్‌డెస్క్ః పిచ్చి పీక్స్‌కెళ్లినప్పుడు పర్ఫామెన్స్ కంటే పాపులారిటీనే కావాలంటారంట! కొందరు సోషల్ మీడియా వీడియో మేకర్ల పరిస్థితి ఇది. ప్రస్తుతం సోషల్ మీడియా వీడియో మేకింగ్ ప్రపంచంలో అత్యంత వ్యసనంగా మారిపోయింది. భూమిపైన కాలుష్యం పెరిగినట్లు రోజురోజుకూ పెరిగిపోతోంది ఈ పిచ్చి. దీనితో వాళ్ల వీడియోలకు విపరీతంగా లైక్‌లు రావడానికి విచ్చలివిడిగా రెచ్చిపోతున్నారు కొందరు. ఇలాగే, ఇటీవలి ఓ విచిత్రమైన వీడియో మేకింగ్ ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. టిక్‌టాక్ వీడియో కోసం పాకిస్థానీ సోషల్ మీడియా సంచలనం హుమైరా అస్గర్ కాలిపోతున్నఅడవి ముందుఫోజులిచ్చింది.
క్లైమెట్ ఛేంజ్‌తో ఎండలు మండిపోతూ, భూతాపం పెరిగిపోతూ, అడువులు కాలి బూడిదవుతుంటే.. వాటిని సంరక్షించడానికి ప్రయత్నించకపోగా, "నేను ఎక్కడికి వెళ్లినా మంటలు చెలరేగుతాయి" అని హుమైరా అస్గర్ సదరు సెగల వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు హుమైరాపైన మండిపడ్డారు. చిన్న వీడియో కోసం అడివిని తగలబెడతావా అంటూ తిట్ల దండకం అందుకున్నారు. పాపులారిటీ మత్తు నుండి తేరుకున్న అమ్మడికి బొమ్మ కనిపడింది. ఈ మంటలు నేను పెట్టినవి కాదంది. మండుతున్న దాని పక్కన వీడియో తీసుకోవడం తప్పు కాదుకదా అంటూ బుజాలు సర్థుకుంది. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని 'డిస్కవర్ పాకిస్థాన్' అనే ట్విట్టర్ యూజర్ డిమాండ్ చేశారు. మొత్తానికి, హుమైరా వీడియో తొలగించింది. కానీ, నెటిజన్‌లు మాత్రం ఊరుకోవట్లేదు. "అధికారులు ఏమీ చేయకపోతే కనీసం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆమెను బ్లాక్ చేయవచ్చు" అని వీడియో కింద వ్యాఖ్యలు పెడుతున్నారు. ఆమెను నిషేధించాలని, శిక్షించాలని అభ్యర్థిస్తున్నారు.
This tiktoker from Pakistan has set fire to the forest for 15 sec video.
— Discover Pakistan 🇵🇰 | پاکستان (@PakistanNature) May 17, 2022
Government should make sure that culprits are punished and the tiktoker along with the brand should be penalised. #Pakistan #TikTok pic.twitter.com/76ad77ULdJ