అయస్కాంతాల నుంచి ఆక్సిజన్.. అంతరిక్ష అన్వేషణలో కీలక అడుగు
దిశ, ఫీచర్స్ : భూగ్రహంతో పోల్చినపుడు నడవడం, శ్వాసించడం, అనుకూల వాతావరణం వంటివి అంతరిక్షంలో భిన్నంగా ఉంటాయని తెలిసిందే. అక్కడ నెలకొన్న సూక్ష్మ-గురుత్వాకర్షణ పరిస్థితే ఇలాంటి బహుళ సవాళ్లను సృష్టిస్తూ జీవుల మనుగడను కష్టతరం చేస్తోంది..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : భూగ్రహంతో పోల్చినపుడు నడవడం, శ్వాసించడం, అనుకూల వాతావరణం వంటివి అంతరిక్షంలో భిన్నంగా ఉంటాయని తెలిసిందే. అక్కడ నెలకొన్న సూక్ష్మ-గురుత్వాకర్షణ పరిస్థితే ఇలాంటి బహుళ సవాళ్లను సృష్టిస్తూ జీవుల మనుగడను కష్టతరం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వార్విక్ యూనివర్సిటీ పరిశోధకులు అయస్కాంతాలను ఉపయోగించి ఆక్సిజన్ తయారు చేశారు. అవును.. మీరు విన్నది నిజమే! ఈ పురోగతి అంతరిక్ష అన్వేషణకు సంబంధించి భవిష్యత్ వ్యోమగాములకు సాయపడనుంది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో.. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించే విద్యుత్ విశ్లేషణ కణాన్ని ఉపయోగించి ఆక్సిజన్ ఉత్పత్తి చేయబడుతుంది. కానీ ముందుగా ఆ వాయువులను వ్యవస్థ నుంచి బయటకు తీసుకురావాల్సి ఉంటుందని అధ్యయన ప్రధాన రచయిత అల్వారో రొమెరో-కాల్వో తెలిపారు. ఈ పద్ధతి అంగారక గ్రహానికి వెళ్లేందుకు పని చేయకపోవచ్చు. పైగా పరిస్థితిని మరింత జఠిలంగా మార్చవచ్చు. ప్రస్తుతం నాసా.. అంతరిక్షంలో ఆక్సిజన్ పొందడానికి సెంట్రిఫ్యూజెస్ ఉపయోగిస్తోంది. ఈ భారీ యంత్రాలు శక్తితో కూడుకున్నవి. అయితే ఇదేవిధమైన ఫలితాలను అయస్కాంతాలు కూడా మరింత ఆచరణాత్మకంగా ఉత్పత్తి చేయగలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
అయస్కాంతాలతో ఆక్సిజన్ ఉత్పత్తి :
జర్మనీలోని సెంటర్ ఫర్ అప్లైడ్ స్పేస్ టెక్నాలజీ అండ్ మైక్రోగ్రావిటీ (ZARM) వద్ద మైక్రోగ్రావిటీ పరిస్థితులను అనుకరించే సదుపాయంతో ఈ పరీక్షలు నిర్వహించారు. 'కొన్నేళ్ల విశ్లేషణాత్మక, గణన పరిశోధనల తర్వాత జర్మనీలో ఈ అద్భుతమైన డ్రాప్ టవర్‌ను ఉపయోగించగలగడం.. జీరో-జీ స్పేస్ వాతావరణంలో ఈ కాన్సెప్ట్ పనిచేస్తుందనే ఖచ్చితమైన రుజువును అందించింది' అని కొలరాడో బౌల్డర్ యూనివర్సీటీ ప్రొఫెసర్ హాన్స్‌పీటర్ షాబ్ చెప్పారు. పరిశోధకులు 'బ్రెమెన్ డ్రాప్ టవర్ వద్ద 9.2 సెకన్ల పాటు ఉత్పత్తి చేయబడిన మైక్రోగ్రావిటీ పరిసరాల్లో ఎలక్ట్రోడ్ ఉపరితలాల నుంచి గ్యాస్ బుడగలను వేరు చేయడానికి ఒక విధానాన్ని ఉపయోగించారు. ముఖ్యంగా, మైక్రోగ్రావిటీలోని ఒక సాధారణ అయస్కాంతం నుంచి గ్యాస్ బుడగలను వివిధ రకాల సజల ద్రావణాలలో ముంచడం ద్వారా వాటిని 'ఆకర్షించవచ్చు, వికర్షించవచ్చు' అని ఇది మొదటిసారిగా చూపించింది.
2060 నాటికి మధ్య ఆసియాకు తీవ్రమైన నీటికరువు!