Osteoarthritis : కీళ్లు నొప్పిగా ఉన్నాయా?.. అయితే ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు?

పొద్దున్న లేవగానే మీ చేతులు, కాళ్లు, కీళ్లు నొప్పిగా ఉంటున్నాయా?

Update: 2023-02-24 07:37 GMT

దిశ, ఫీచర్స్ : పొద్దున్న లేవగానే మీ చేతులు, కాళ్లు, కీళ్లు నొప్పిగా ఉంటున్నాయా? అయితే అది ఆస్టియో ఆర్థరైటిస్‌ కావచ్చు అంటున్నారు ఆర్థోపెడిక్ నిపుణులు. ఎముకల చివర మృదులాస్థి క్షీణించించడంవల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అధిక బరువు, ఊబకాయం, జీవనశైలి ప్రభావాలవల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ప్రధానంగా వయస్సుపై బడిన వారిలో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. నడీడు వయస్సు మహిళల్లోనూ అధికంగా ఉంటుంది. అధిక బరువువల్ల కాళ్లపై ఒత్తిడి పెరగడం కారణంగాను, కొవ్వు కణజాలం కీళ్ల చుట్టుపక్కల మంటను పుట్టించే ప్రోటీన్స్‌ ఉత్పత్తివల్ల కూడాను ఈ సమస్య తలెత్తుతుంది.

కారణాలు..

అధిక బరువు, దెబ్బలు తగలడం, ఆటలు ఆడడం, ప్రమాదంలో తగిలిన దెబ్బలు వంటివి ఆస్టియో ఆర్థరైటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. తీవ్రమైన కీళ్ళనొప్పులు, కీళ్ళు, మోకాళ్ళు దృఢంగా మారి రోజువారీ పనులు చేసుకోవడానికి ఈ సమస్య ఆటంకంగా మారుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన స్త్రీ, పురుషులిద్దరూ ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. ఎక్కువగా చేతులు, మోకాళ్ళపై ప్రభావం చూపే ఈ సమస్య త్వరగా తగ్గకపోతే ట్రీట్ మెంట్ అవసరమని వైద్య నిపుణులు చెప్తున్నారు.

మృదులాస్థి క్షీణించడంవల్ల

ఆస్టియో ఆర్థరైటిస్‌ను డీజెనరేటివ్ జాయింట్ డిసీజ్, వేర్ అండ్ టియర్ ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ఇది ఎముకల చివరలో కీలులోని మృదులాస్థి క్షీణించడం వల్ల వస్తుంది. రోజులు మారే కొద్ది సమస్య పెరుగుతుంది. చేతులు, మోకాలు, వెన్నెముకలోని కీళ్ళు నొప్పిగా ఉండి ఇబ్బందికి గురిచేస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా ఉదయంపూట పూట జాయింట్స్ స్టిఫ్‌గా మారుతాయి. నొప్పి, స్టిఫ్‌నెస్, వాపు ఉంటాయి. ఈ సమస్యతో బాధ పడుతున్నవారు చేతి నొప్పి ఎక్కువగా ఉండడం, కొన్ని సార్లు స్పర్శ లేకపోవడం వంటి అనుభవాలు ఎదుర్కొంటారు. చేతి వేళ్లు వంగిపోవడం జరుగుతుంది. ఈ స్థితిని ఆస్టియోఫైట్స్ అంటారు. దీని కారణంగా చేతిలో అదనపు ఎముకలు పెరిగే అవకాశం ఉంటుంది.

లక్షణాలు..

ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారిలో కాళ్లు, చేతుల కీళ్లు నొప్పిగా ఉంటాయి. దృఢత్వం కోల్పోవడం, చేతుల్లో పట్టు కోల్పోవడం. మంటగా అనిపించడం, అరచేతుల్లో వాపు కనిపిస్తుంది. సమస్యను చూసి భయపడకుండా యాక్టివ్‌గా ఉండడంవల్ల, అధిక బరువు సమస్యను నివారించుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. సమస్య అధికంగా అనిపిస్తే ట్రీట్ మెంట్ తీసుకోవాలి.

వర్కవుట్స్

హ్యాండ్ వర్కవుట్ వల్ల ఆస్టియో ఆర్థరైటిస్‌ నొప్పులు తగ్గుతాయి. పిడికిలి బిగించడంవల్ల కీళ్ల కదలికలు మెరుగ్గా ఉంటాయి. 'చేతి వేళ్లను స్ట్రెయిట్‌గా పెట్టి పిడికిలి బిగుస్తుండాలి. ఇది నెమ్మదిగా చేయండి. మళ్లీ యథస్థానానికి రండి. దీంతో పాటు ఫింగర్ లిఫ్ట్స్ కూడా ట్రై చేయొచ్చు. అదెలాగంటే మీ అరచేతిని టేబుల్‌పై బోర్లా పెట్టండి. నెమ్మదిగా పైకి లేపి వేళ్లని మడిచి తెరుస్తూ ఉండండి'' ఇలా చేయడంవల్ల సమస్య తగ్గుతుంది అంటున్నారు నిపుణులు.

ఎవరికి వస్తుందంటే..

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అధిక బరువు, ఊబకాయం సమస్య ఉన్నవారిలో, వృద్ధుల్లో , 50 ఏండ్లు పై బడిన వారిలో ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. వంశపారంపర్యంగానూ ఈ సమస్య తలెత్తవచ్చు. కీళ్ళకు గాయాలు అయినప్పుడు, కష్టతరమైన పనులు చేసినప్పుడు సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది.

ట్రీట్‌మెంట్..

వయస్సు, సమస్య లక్షణాలను బట్టి వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తారు. ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొంటున్నవారు వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఎందుకంటే నొప్పుల ప్రభావాన్ని బట్టి డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ అందిస్తారు. దీంతో వ్యాధి నివారణకోసం ఆరోగ్య కరమైన జీవన శైలి కూడా అవసరం అనేది గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి: 

మధ్యాహ్నం వ్యాయామం చేస్తే.. ఏమవుతుందో తెలుసా?  

Tags:    

Similar News