ఓర్కాస్ తిమింగలాలు.. పిల్లల కోసం జీవితాంతం ఆహారం సేకరిస్తాయట !

ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన బిడ్డలకోసం ఆరాటపడే గొప్ప మనస్తత్వం మనుషుల్లోనే కాదు, జంతువులు, జలచరాల్లోనూ ఉంటుంది.

Update: 2023-08-01 07:03 GMT

దిశ, ఫీచర్స్: ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన బిడ్డలకోసం ఆరాటపడే గొప్ప మనస్తత్వం మనుషుల్లోనే కాదు, జంతువులు, జలచరాల్లోనూ ఉంటుంది. ఉత్తర పసిఫిక్‌లో ఓర్కాస్ అని పిలువబడే కిల్లర్ వేల్స్‌పై సైంటిస్టులు జరిపిన ఒక అధ్యయనంలో ఇది మరోసారి వెల్లడైంది. ఈ తిమింగలాలు తమ సంతానానికి ఆహార సేకరణకోసం ప్రాణాన్ని పణంగా పెడతాయని నిపుణులు చెప్తున్నారు.

ఫుడ్ సమకూర్చే క్రమంలో తీవ్రంగా అలసిపోతాయని, శక్తిహీనంగా మారుతాయని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్‌కు చెందిన ప్రొఫెసర్ డారెన్ క్రాఫ్ట్ అంటున్నారు. అయితే తల్లి తిమింగలాలు తమ సంతానం జీవితమంతా తమతోనే కలిసి ఉంటుందని నమ్ముతాయట. కానీ ఆడ తిమింగలాలు మాత్రం పెరిగిన తర్వాత ఇండిపెండెంట్‌గా మారతాయని సైంటిస్టుల పరిశీలనలో తేలింది. మగ తిమింగలాలు మాత్రం తమ తల్లులపైనే ఆధారపడుతుంటాయి. ఆహారాన్ని సొంతంగా సమకూర్చుకోకుండా తల్లి సేకరించిన దానిని తింటూ కాలం గడుపుతాయి. అరుదుగా సేకరించినా తల్లితో కలిసి పంచుకుంటాయి. 

Also Read:   ఆన్‌లైన్ రిలేషన్‌షిప్.. టెంపరరీ సెక్సువల్ పార్టనర్ కోసం వెతుకుతున్న యువత

Tags:    

Similar News