డ్రై ఐ సిండ్రోమ్ వేధిస్తోందా? .. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే !

తరచుగా పొడి వాతావరణంలో ఉండటం, పొగ లేదా కాలుష్యానికి గురవడంతో కళ్లు పొడిబారుతాయి. అలెర్జీలు, కాంటాక్ట్ లెన్స్‌లు ధరించడం

Update: 2023-05-14 11:43 GMT

దిశ, ఫీచర్స్ : తరచుగా పొడి వాతావరణంలో ఉండటం, పొగ లేదా కాలుష్యానికి గురవడంతో కళ్లు పొడిబారుతాయి. అలెర్జీలు, కాంటాక్ట్ లెన్స్‌లు ధరించడం కూడా కళ్లకు చికాకు కలిగిస్తుంది. ఎక్కువసేపు చదవడం, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం, పోషకాహార లోపం, కండ్ల కలక వంటి సమస్యలు కూడా ‘డ్రై ఐ సిండ్రోమ్‌’కు దారితీస్తుండగా.. కళ్లు మండటం, దురద, చిరాకు, దృష్టి కేంద్రీకరించలేక బాధపడుతుంటారు. పిల్లలు, యువకుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండగా.. పట్టించుకోకుండా వదిలేస్తే అంధత్వం రావచ్చు. అందుకే అలాంటి లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దంటున్న నిపుణులు.. ఇంట్లో పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు.

లక్షణాలు

పిల్లలు కంటి సంబంధిత సమస్యల గురించి చెప్పడం తెలియకపోవచ్చు. అందుకే తరచుగా కళ్లు రుద్దుకోవడం, తుడుచుకుంటూ ఉండటం వంటివి గమనిస్తే డ్రై ఐ సిండ్రోమ్ ఉందేమో నిర్ధారించుకోవాలి. తరచుగా కను రెప్పలు కొట్టుకోవడం(Frequent blinking), కళ్ల చుట్టూ ఎరుపుగా మారడం, నిరంతరం కళ్లల్లో దురద, లైటింగ్ భరించకపోవడం, కళ్ల చుట్టు పక్కల ఎరుపుగా మారడం, కళ్లు మండటం, అస్పష్టమైన దృష్టి వంటివి లక్షణాలుగా ఉంటాయి.

నివారణ-చికిత్స

డ్రై ఐ ప్రాబ్లమ్ సింప్టమ్స్‌ను తగ్గించడానికి ఆప్తమాలజిస్టులు ఆర్టిఫిషియల్ టియర్స్‌ను సిఫారసు చేస్తారు. నిపుణులు సూచనతో ఉపశమనం పొందేందుకు ఇంటి నివారణ చిట్కాలను కూడా పాటించవచ్చు. ముఖ్యంగా కళ్లకు చికాకు కలిగించే పొగ, ఇతర వస్తువులకు దూరంగా ఉండండి. ఎండలో బయటకు వెళ్తే సన్ గ్లాసెస్ ధరించడం, టోపీలు పెట్టుకోవడం, గొడుగులను ఉపయోగించడం చేయాలి. కళ్లల్లోకి దుమ్ము, ధూళి చేరకుండా చూడాలి. చిన్న పిల్లలు నిద్రిస్తున్నప్పుడు ఫ్యాన్లను ఉపయోగించవద్దు. పిల్లలకు కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తుంటే గనుక రీవెట్టింగ్ డ్రాప్స్‌ని ఉపయోగించాలి లేదా కళ్ల సమస్య పోయే వరకు అద్దాలు వాడాలి. డాక్టర్లు సూచించిన మెడిసిన్ తీసుకోవాలి. వీటివల్ల అలర్జీలు, ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. కళ్లు పొడిబారిన పిల్లలకు రోజుకు నాలుగుసార్లు ఆర్టిఫిషియల్ ఐ డ్రాప్స్‌ను యూజ్ చేయాలి. ప్రతిరోజూ ఉదయం కనురెప్పలపై 5 నిమిషాల తేమతో కూడిన క్లాత్‌ను ఉంచాలి. తర్వాత కనురెప్పలను తేలికగా మసాజ్ చేయాలి. ఇది కళ్లలో నేచురల్ తేమను పెంచడానికి సహాయపడుతుంది.

Read more:

లివర్‌ను కాపాడుకోవాలంటే ఈ జ్యూస్ తప్పకుండా తాగాల్సిందే!

Tags:    

Similar News