మీరు ఈ ప్యాలెస్ కి రాజు కావాలనుకుంటున్నారా.. ఒక్క రాత్రికి అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
సకల సౌఖ్యాలు ఉండే విలాసవంతమైన రాజభవనాలలో నివసించడం, రాజులా, రాణిలా జీవితం గడపాలని ఎవరికి మాత్రం ఉండదు.
దిశ, ఫీచర్స్ : సకల సౌఖ్యాలు ఉండే విలాసవంతమైన రాజభవనాలలో నివసించడం, రాజులా, రాణిలా జీవితం గడపాలని ఎవరికి మాత్రం ఉండదు. చాలామంది ఇలా అనుకున్నా వారి కోరిక నెరవేరక నిరాశపడుతూ ఉంటారు. డబ్బు ఎక్కువగా ఉన్నవారు రాజులు, చక్రవర్తుల లాగా విలాసంగా, వైభవంగా జీవితాన్ని గడుపుతారు. ఒకవేళ డబ్బు ఉన్నా రాజభవనంలో గడిపేందుకు అందమైన కోటలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటారు. సరే, మీకు కూడా అలాంటి కల ఉంటే పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. మీరు నేరుగా జపాన్‌కు వెళితే అక్కడ అందమైన రాజభవనం ఉంది. ఉంటే మాకేంటి అనుకుంటున్నారా.. అయితే ఈ రాజభవనాన్ని ఒక రోజుకు, ఒక రాత్రికి అద్దె ఇస్తారా. మీకు కావాలంటే, మీరు అక్కడ రాజు కావచ్చు. కానీ ఇక్కడ ఉండటానికి చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఆ ప్యాలెస్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్యాలెస్ జపాన్‌లోని ఎహిమ్ ప్రావిన్స్‌లోని ఓజు నగరంలో ఉంది. దీని పేరు ఓజు కాజిల్. ఈ కోట చెక్కతో చేసినప్పటికీ చాలా అందంగా ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఈ నాలుగు అంతస్తుల ప్యాలెస్‌లో రాత్రంతా గడిపి రాజులా విలాసవంతంగా జీవిస్తున్నారు. కావాలంటే మీరు కూడా ఈ రాజభవనానికి రాజు, రాణి అయి వారిలా తిని పడుకోవచ్చు.
ఒక రాత్రి ధర 8 లక్షలు..
16వ శతాబ్దంలో ఓజు అనే రాజు ఈ ప్యాలెస్‌లో విలాసవంతంగా జీవించినట్లుగానే ఇక్కడికి వచ్చు అతిథులు కూడా ఇక్కడ బస చేసే అవకాశం ఉంది. అయితే, ఇది ఆ యుగపు కోట కాదు, ఎందుకంటే అసలు ఓజు కోట 1888 సంవత్సరంలో దెబ్బతిన్నది. ఆ తర్వాత 1990లలో కోటను పునర్నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్యాలెస్ చెక్కతో చేసినప్పటికీ. ప్యాలెస్ లో బస చేసేందుకు ఒక రాత్రికి దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు.
అతిథిని రాజులా స్వాగతిస్తారు..
ఈ ప్యాలెస్‌కి వచ్చే అతిథులకు చాలా ప్రత్యేకమైన రీతిలో స్వాగతం పలుకుతారు. మొదట ఓజు సాంప్రదాయ ధ్వనిని ప్లే చేస్తారు. అతిథి రాజు వేషధారణలో ఉంటారు. అప్పుడు కొంతమంది ఆర్మీ యూనిఫాం ధరించిన అతిథులను ప్యాలెస్ లోపలికి తీసుకువెళతారు. అక్కడ వారి ముందు సంప్రదాయ నృత్యం ప్రదర్శిస్తారు. తర్వాత రాజ విందు ఉంటుంది. విందు సమయంలో పద్య పఠనంతో పాటు, మధురమైన సంగీతం కూడా ప్లే చేస్తూనే ఉంటుంది. ఓవరాల్‌గా ఇక్కడ బస చేసే అతిథులకు రాజుల అనుభూతి కలుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్క రోజు రాజు కావాలనుకుంటే ఈ ప్యాలెస్ కి వెళ్లిరండి.