Paris Olympics: షాకింగ్.. ఒలింపిక్స్ ఆటగాళ్లలో ఆల్మోస్ట్ అందరికీ ఒకే వ్యాధి..

ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్- 2024 అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన క్రీడాకారులు హాజరుకాగా.. మెడల్స్ సాధించడంలో చైనా ముందుండగా.. రెండో స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. ఇక ఇండియా ప్రస్తుతం 57వ స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే

Update: 2024-08-05 15:21 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్- 2024 అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన క్రీడాకారులు హాజరుకాగా.. మెడల్స్ సాధించడంలో చైనా ముందుండగా.. రెండో స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. ఇక ఇండియా ప్రస్తుతం 57వ స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్ స్టడీ షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఒలింపిక్ అథ్లెట్స్ చాలా మంది ఒకే రకమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. స్కాండినేవియన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ & సైన్స్ ఇన్ స్పోర్ట్స్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం... ఒలింపిక్ అథ్లెట్లలో 15 నుంచి 20 శాతం మధ్య ఆస్తమాతో బాధపడుతున్నట్లు తేలింది. ఇదే అధ్యయనం ప్రకారం 80 శాతం వరకు ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ అథ్లెట్లు వ్యాయామం-ప్రేరిత బ్రోంకోకాన్‌స్ట్రిక్షన్ (EIB) లేదా వ్యాయామం-ప్రేరిత ఆస్తమా ద్వారా ప్రభావితమవుతున్నట్లు తెలిసింది.

ఆస్తమా అనేది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. కాగా ఇది చిన్న శ్వాసనాళాల వాపు, సంకుచితానికి కారణమవుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, గురక, మరియు ఛాతీలో బిగుతుగా ఉండటం, విపరీతమైనప్పుడు ప్రాణాంతకమైన ఆస్తమా దాడిని ప్రేరేపించగలవు. వ్యాయామం వల్ల కలిగే ఆస్తమా... ముఖ్యంగా చల్లని, పొడి పరిస్థితులలో తీవ్రమైన శారీరక శ్రమల ద్వారా కలుగుతుందని చెప్తున్నారు నిపుణులు. క్రీడాకారులు వ్యాయామం చేసినప్పుడు వెంటిలేషన్ రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఎక్కువ గాలిని పీల్చుకుంటారు. ఇందులో ఈ గాలి చాలావరకు నోటి ద్వారా వస్తుంది. ఊపిరితిత్తులలోకి వచ్చే సమయానికి చాలా పొడిగా ఉంటుంది. ఫిల్టర్ చేయబడదు. కాబట్టి ఆస్తమా ఎటాక్ అవుతుందని చెప్తున్నాయి అధ్యయనాలు.

క్రాస్ కంట్రీ స్కీయర్‌లు, ప్రొఫెషనల్ సైక్లిస్ట్‌లు, ట్రాక్ రన్నర్‌ల వంటి చల్లని గాలిలో ప్రాక్టీస్ చేసే ఎండ్యూరెన్స్ అథ్లెట్‌లపై ఆస్తమా ప్రభావం చూపే అవకాశం అధికంగా ఉంది. ఇతర వాటర్ స్పోర్ట్స్‌తో పోలిస్తే ముఖ్యంగా స్విమ్మర్స్ లో ఆస్తమా ఎక్కువగా ఉన్నట్లు జర్నల్ ఆఫ్ అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీలో ప్రచురించిన అధ్యయనం కనుగొంది. ఊపిరితిత్తులకు చికాకు కలిగించే పూల్ ఉపరితలంపై క్లోరిన్ సబ్ ప్రొడక్ట్స్ కారణంగా ఇది జరుగుతుందని భావిస్తున్నారు. ఇక 2012, 2016, 2020 సమ్మర్ గేమ్స్ సమయంలో 4-7% మంది అథ్లెట్లు ఏదో ఒక రకమైన అనారోగ్యంతో బాధపడ్డారు. 9% మంది పోటీదారులు అనారోగ్యంతో బాధపడుతున్నందున 2018 వింటర్ గేమ్స్ మెరుగ్గా జరగలేదని తాజా అధ్యయనం చెప్తుంది. వీరిలో ఎగువ శ్వాసకోశ అంటువ్యాధులు అత్యంత సాధారణ వ్యాధులుగా గుర్తించినట్లు తెలిపింది.

Tags:    

Similar News