పాత చీరలతో సస్టెయినబుల్ ఫ్యాషన్..
పాతకాలపు చీరల ఫాబ్రిక్, వాటిపై పొందుపరిచిన హస్తకళను పోల్చలేం. దశాబ్దం కిందట కోల్‌కతాకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మేఘనా నాయక్ కూడా ఓసారి తన తల్లి వార్డ్‌రోబ్ చూసినప్పుడు ఇదే విషయాన్ని గ్రహించింది..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : పాతకాలపు చీరల ఫాబ్రిక్, వాటిపై పొందుపరిచిన హస్తకళను పోల్చలేం. దశాబ్దం కిందట కోల్‌కతాకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మేఘనా నాయక్ కూడా ఓసారి తన తల్లి వార్డ్‌రోబ్ చూసినప్పుడు ఇదే విషయాన్ని గ్రహించింది. ఇంకా అందులోనే ఆమె తల్లి కట్టుకోని వందలాది చీరలను చూసిన మేఘన వాటన్నింటినీ ఏం చేయొచ్చన్న ఆలోచనలో పడింది. అదే 'లతాసీత' పేరుతో డిజైన్ స్టూడియో ఏర్పాటుకు దారితీసింది. ప్రస్తుతం ఈ SMB బ్రాండ్.. వార్డ్‌రోబ్స్, దుర్గాపూజ మండపాల నుంచి సేకరించిన చీరలను ఫ్యాషనబుల్, సస్టెయినబుల్ అవుట్‌ఫిట్స్‌గా అప్‌సైకిల్ చేస్తోంది. వస్త్ర వ్యర్థాలను తగ్గించడం సహా పాత బట్టలను మట్టిలో కలవకుండా నిరోధించే లక్ష్యంతో పనిచేస్తోంది.
2012లో రూ. 5 లక్షల సేవింగ్స్‌తో మేఘన 'లతాసీత' డిజైన్ స్టూడియోను ప్రారంభించింది. దేశ వస్త్ర వారసత్వాన్ని కాపాడే ప్రయత్నంలో పాత చీరలను 'జీరో-వేస్ట్, ఎథికల్లీ ప్రొడ్యూస్డ్' పద్ధతుల్లో అప్‌సైకిల్ చేస్తూ మహిళల కోసం క్లాసిక్ అవుట్‌ఫిట్స్ రూపొందిస్తోంది. ఈ మేరకు జాకెట్స్, కిమోనోస్, ష్రగ్స్, కుర్తాలు, డ్రెసెస్ వంటి రకరకాల దుస్తులను తయారు చేస్తోంది. 2012 నుంచి 2015 వరకు తన వ్యాపారంలో స్లోగా అడుగులేసిన మేఘన.. తనను తాను నిలబెట్టుకునేందుకు ఒక ఫ్రీలాన్స్ ఎన్విరాన్మెంట్ జర్నలిస్ట్‌గా కూడా పనిచేస్తోంది. ఇక 'ఈ కాన్సెప్ట్ అందరికీ నచ్చినా, వేరొకరు వాడేసిన దుస్తులను ధరించడంలో కొన్ని మూఢనమ్మకాలు వినియోగదారులను వెనుకాడేలా చేస్తున్నాయి. అయితే అప్‌సైకిల్ ఫ్యాబ్రిక్ ధరించడం వల్ల పర్యావరణ ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి నాకు చాలా సమయం పట్టింది' అని మేఘన గుర్తు చేసుకుంది.
పాత బట్టలను పునర్నిర్మించడం
ఉమెన్ వార్డ్‌రోబ్స్‌లో పాతబడిన, వాడని లేదా బహుమతిగా పొందిన చీరలే 'లతాసీత' దుస్తులకు ప్రధాన వనరులు. కాగా 2021లో మేఘన కోల్‌కతా అంతటా దుర్గాపూజ మండపాల్లో ఉపయోగించిన చీరల కోసం స్కౌట్ చేసింది. తద్వారా టన్నుల కొద్దీ బట్టలను తిరిగి తయారు చేసింది. ఈ సంస్థ ప్రధానంగా రెండు 'అందమైన(Pet), అనుకూలమైన(Custom)' కలెక్షన్స్ అందిస్తోంది. మొదటిది నేత కార్మికుల డెడ్ స్టాక్, దుర్గాపూజ పాండల్స్, హోల్‌సేల్ మార్కెట్స్, మహిళల క్లోసెట్స్ నుంచి కిలోలకొద్దీ సేకరించిన చీరలతో తయారుచేసిన ఉత్పత్తి. రెండోది 'Send Us Your Saree' ప్రచారం ద్వారా సృష్టించిన కస్టమ్ కలెక్షన్. ఈ ప్రచారం కస్టమర్లు తమ చీరలను నచ్చినట్లుగా మార్చుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ మేరకు 'థ్రెడ్, ఎలాస్టిక్, జిప్, హుక్, బటన్స్' కొత్తవి అమర్చుతారు. ఫిక్చర్స్, లైనింగ్ తరచూ అప్‌సైకిల్ చేయబడతాయి. 'లతాసీత' ఇప్పుడు టస్సార్ కర్టెన్ల నుంచి షేర్వాణీలను తయారు చేసింది. ఇది డెనిమ్ జాకెట్స్‌లో కస్టమర్‌కు సరిపోని అనేక పాత జతల జీన్స్‌లను కూడా పునర్నిర్మించింది.
గ్రోత్, చాలెంజెస్ :
నెలకు 30 నుంచి 40 ఆర్డర్స్ అందుకుంటున్న 'లతాసీత'.. Pret కలెక్షన్ ఎగ్జిబిషన్స్‌పై దృష్టి సారించింది. ఇందుకోసం ఏడాదికి 750 వస్త్రాలను తయారు చేస్తోంది. ఇక మేఘన.. తైవాన్, ఇంగ్లాండ్, కెన్యా, శ్రీలంక, జర్మనీ, స్వీడన్, బెల్జియం, నెదర్లాండ్స్‌లో ఎగ్జిబిషన్స్‌కు కూడా తన దుస్తులను తీసుకెళ్లింది. ఈ బ్రాండ్ బట్టల ధర రూ. 2,500 నుంచి రూ. 25,000 మధ్య ఉండగా.. రూ.3,000 నుంచి రూ.8,000 రేంజ్‌లో ఉన్న ఉత్పత్తులు బెస్ట్ సెల్లర్‌గా కొనసాగుతున్నాయి. గత ఐదారేళ్లలో 'I Was A Saree, Pitara, Dooglage' వంటి బ్రాండ్స్ సహా 'హౌస్ ఆఫ్ వాండరింగ్ సిల్క్, బోడెమెంట్స్' వంటి అంతర్జాతీయ లేబుల్స్ ఈ అప్‌సైకిల్ ఫ్యాషన్ విభాగంలో ఉద్భవించాయి.
ఇక సవాళ్ల విషయానికొస్తే.. చీరను అప్‌సైకిల్ చేయడానికి టైమ్ పడుతుందని, డిజైన్‌ను పునరావృతం చేయలేమని మేఘన వెల్లడించింది. 'ప్రతి ఫ్యాబ్రిక్ ముక్కపై వ్యక్తిగతంగా పని చేయాలి. ఒక నమూనాను సృష్టించినప్పటికీ, ప్రతిసారీ ప్లేస్‌మెంట్ మారుతుంది. చీరకు నిర్ణీత వెడల్పు ఉంటుంది, సరిహద్దుల ద్వారా బుక్‌ఎండెడ్ చేయబడి ఉంటుంది. ఇది డిజైన్‌కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జోడించాలి. మరమ్మత్తు చేయడం, పునరుద్ధరించడం, శుభ్రపరచడం, డార్నింగ్ చేయడంలో చెప్పలేనంత పని ఉంటుంది' అని ఆమె వివరిస్తోంది. ఇక పాండమిక్ టైమ్‌లో కంపెనీ నష్టాలు ఎదుర్కోగా.. D2C వెబ్‌సైట్ ప్రారంభించాక ఈ ఏడాది 25-30% వృద్ధి చెందుతుందని నమ్మకంగా ఉన్నారు.
స్థిరమైన భవిష్యత్తు వైపు..
వ్యాపార యజమానులకు ఆర్థిక కోణంలోనే కాక సామాజిక, పర్యావరణ దృక్కోణాల నుంచి కూడా లాభనష్టాలు కూడా ఉన్నాయి. కానీ అవి పరిగణించబడవు. వస్త్ర కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు అన్యాయమైన పని పరిస్థితులు, తక్కువ వేతనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. రసాయన రంగులు, భారీ మొత్తంలో వ్యర్థాలు, అంతరాయం కలిగించే ప్రక్రియలు పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి. వ్యాపారాలు ఈ నష్టాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. లాభం ఆర్థిక శాస్త్రానికి మించి ఉండాలి. నికర సామాజిక, పర్యావరణ లాభాలను కూడా పరిగణించాలి. నేను వ్యాపారాన్ని స్కేల్ చేయాలనుకుంటున్నాను కానీ పర్యావరణానికి సంబంధించిన ఖర్చుతో కాదు.
- మేఘన, లతాసీత ఫౌండర్