అక్కడ సన్నగా ఉన్నా శాపమే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్న అధికారులు..

ఈ రోజుల్లో మన జీవన విధానం ఎంతగా మారిపోయింది. తినే తిండిలో ఎంతగానో మార్పు వచ్చింది.

Update: 2024-03-02 12:20 GMT

దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో మన జీవన విధానం ఎంతగా మారిపోయింది. తినే తిండిలో ఎంతగానో మార్పు వచ్చింది. దీంతో చాలామంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు బరువు తగ్గాలని కోరుకుంటారు. ఏదో ఒకవిధంగా ఫిట్‌గా మారాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది చాలా సన్నగా మారిపోతారు. అయితే లావుగా ఉండడం మాత్రమే సమస్య అని మనం అనుకున్నాం. కానీ కొన్ని చోట్ల సన్నగా ఉన్నా అది సమస్యగానే ఉంటుంది. కొన్ని సార్లు అమ్మాయిలు ఎక్కువ సన్నగా ఉన్నా వారికి పెళ్లి జరగడం కష్టంగా ఉంటుంది. మరికొన్ని చోట్ల చాలా సన్నగా ఉన్నవారిని ఉద్యోగంలో చేర్చుకోరు. ఇలాంటి ఒక విచిత్రకరమైన సంఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సన్నగా ఉన్నాడన్న కారణంలో అధికారులు ఓ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ ని రద్దు చేశారట. మరి ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంగ్ల వెబ్‌సైట్ మిర్రర్‌ నివేదిక ప్రకారం ఈ సంఘటన బ్రిటన్ నివాసి జో రోజర్స్‌కు జరిగింది. నిజానికి అతను చాలా సన్నగా ఉంటారు. దీంతో అతను డ్రైవింగ్‌కు అనర్హుడని ప్రకటించి అతని లైసెన్స్‌ను తొలగించారు. అది ఎలా సాధ్యం అనే ప్రశ్న మీ మనస్సులో తలెత్తుతుంది ? నిజానికి ఆ వ్యక్తికి అనోరెక్సియా అనే తినే రుగ్మత ఉంది. దానివల్ల తన బరువు పెరుగుతుందని ఎప్పుడూ భయపడేవాడు. దీని కారణంగా అతను తినడం కూడా మానేశాడ. చాలా సార్లు ఆహారం తిన్న తర్వాత కూడా వాంతులు చేసుకుంటాడట.

రోజర్స్ ఈ అలవాటు కారణంగా అతని బరువు తగ్గుతూనే ఉంది. దీని ఫలితంగా UK రవాణా శాఖ అతడు డ్రైవింగ్ చేయడానికి అనర్హుడని ప్రకటించింది. అతను ఎప్పటికీ డ్రైవింగ్ చేయకూడదని నిషేధం విధించారు. అంతే కాదు ముందుగా తన ఆరోగ్యం బాగుండాలని, అప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందని కట్టుదిట్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. లేకుంటే తన జీవితంలో కారు నడపలేడట.

రవాణా శాఖ ఈ ప్రకటనను అంగీకరిస్తూ స్వయంగా ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత అతని ఆరోగ్యం మెరుగుపడింది. మీడియాతో రోజర్స్ మాట్లాడుతూ రేయిస్ వ్యాధి గురించి ముందుగా తెలిసిందంటే మా అమ్మకే అని తెలిపారు. తాను తినే విధానం మారిపోయిందని అతను గమనించాడని తెలిపారు.

Tags:    

Similar News