నేను తిని, పడుకుంటే రూ.కోటి జీతం ఇస్తున్నారు.. ఫిర్యాదు చేసిన ఎంప్లాయి

గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఏం పనిచేయకుండానే లక్షల్లో జీతాలు తీసుకుంటారనే అభిప్రాయం ఉంది.

Update: 2022-12-03 08:18 GMT

దిశ, ఫీచర్స్: గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఏం పనిచేయకుండానే లక్షల్లో జీతాలు తీసుకుంటారనే అభిప్రాయం ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో టైమ్ పాస్ చేస్తుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి పనిని ఎంజాయ్ చేసే ఉద్యోగులు ఎంతో మంది ఉండగా.. ఓ ఐరిష్ ఎంప్లాయి మాత్రం 'నాకెందుకు జీతమిస్తున్నారు?' అని ప్రశ్నిస్తున్నాడు. ఐర్లాండ్ జాతీయ రైల్వే నెట్‌వర్క్‌కు చెందిన ఫైనాన్షియల్ మేనేజర్.. డ్యూటీ టైమ్‌లో భోజనం చేసి, వార్తాపత్రికలు చదవడానికి దాదాపు నెలకు కోటి రూపాయల జీతం పొందుతున్నట్లు ఐర్లాండ్ వర్క్ ప్లేస్ రిలేషన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.

ఐరిష్ రైల్వే ఉద్యోగి అయిన డెర్మోట్ అలెస్టర్‌కు ఉచితంగా జీతం పొందడం వివక్షగా అనిపించిందట. 2014లో కంపెనీ అకౌంటింగ్‌లో జరుగుతున్న గోల్‌మాల్‌ను బయటపెట్టి విజిల్‌ బ్లోయర్‌గా మారిన తర్వాత.. అతను క్రమంగా తన అన్ని విధుల నుంచి విముక్తి పొందినట్లు చెప్పాడు. రోజూ రెండు న్యూస్ పేపర్లు, శాండ్ విచ్ కొనుక్కుని ఆఫీసుకు వెళ్తానని.. తన క్యూబికల్‌లోకి వెళ్లి కంప్యూటర్ ఆన్ చేసి వర్క్ మెయిల్స్ చెక్ చేసుకుంటానని, కానీ అక్కడ సాధారణంగా ఏ మెయిల్స్ ఉండవని తెలిపాడు. దీంతో న్యూస్ పేపర్ చదివి.. శాండ్ విచ్ తినేస్తానని.. వారంలో ఒక్క రోజు పనిచేసే అవకాశం దొరికిన చాలా థ్రిల్ ఫీల్ అవుతానని వివరించాడు. అయినా సరే ప్రతి నెలా తనకు కోటికి పైగా శాలరీ చెక్కును ఇస్తున్నట్లు తెలిపాడు.

2007లో ఆర్థిక పతనం వరకు దాదాపు $261 మిలియన్ల మూలధన బడ్జెట్‌లకు బాధ్యత వహించేవాడినని తెలిపిన డెర్మోట్. 2010లో పదోన్నతి పొందానని.. కానీ 2013 నుంచి కెరీర్ పడిపోవడం ప్రారంభించినట్లు చెప్పాడు. ఆ ఏడాది మూడు నెలల అనారోగ్య సెలవు తీసుకున్న తాను తిరిగి వచ్చేసరికి రుణగ్రహీతలతో కొన్ని సమస్యలు గమించినట్లు తెలిపాడు. ఇదంతా రవాణా మంత్రికి ప్రొటెక్టెడ్ డిస్‌క్లోజర్ పంపే ముందు మార్చి 2014లో ఐరిష్ రైల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌కు గుడ్ ఫెయిత్ రిపోర్ట్‌ను పంపినట్లు తెలిపాడు. అప్పటి నుంచి.. అతని బడ్జెట్ పోర్ట్‌ఫోలియోతో పాటు కంపెనీలో బాధ్యతలు కూడా తగ్గించబడినట్లు చెప్పాడు. 2013 నుంచి 2014 వరకు చేస్తున్న పనికి సరైన జీతం పొందుతున్నానని అనుకున్న తనకు ఇప్పుడు ఎందుకు జీతమిస్తున్నారని అనిపిస్తుందన్నాడు. తనకు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుందని, కంపెనీ సమావేశాలు మరియు ట్రైనింగ్ ఆపర్చునిటీస్ నుంచి పూర్తిగా మినహాయించబడ్డాడని వెల్లడించాడు.

READ MORE

పేగు ఆరోగ్యంపై 24/7 అప్‌డేట్స్ అందించే మాత్ర.. త్వరలోనే అందుబాటులోకి 

Tags:    

Similar News