నేరేడు పండ్లే కాదు.. గింజలు కూడా మంచిదే.. హెల్త్ బెనిఫిట్స్ ఇవిగో..

వర్షాకాలంలో లభించే సీజనల్ ఫ్రూట్స్‌లో నేరేడు పండ్లు కూడా ఒకటి. అయితే ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వాటి గింజలు కూడా మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.

Update: 2024-07-16 12:37 GMT

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో లభించే సీజనల్ ఫ్రూట్స్‌లో నేరేడు పండ్లు కూడా ఒకటి. అయితే ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వాటి గింజలు కూడా మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. కాకపోతే వీటిని నేరుగా తినలేం. ఎండబెట్టి తర్వాత పొడిగా చేసి ఆ చూర్ణాన్ని తేనె, చక్కెర వంటి పదార్థాలతో కలిపి తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. అయితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

* నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. నేరేడు గింజల్లో జాంబోలిన్, జాంబోసిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లుకు మంచిదని చెప్తుంటారు. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా కలిగి ఉండటంవల్ల లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నేరేడు గింజల్లో ఎల్లాజిక్ యాసిడ్ ఉంటుంది ఇది రక్తపోటులో సమతుల్యతకు దోహదం చేస్తుంది.

* నేరేడు గింజలు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో, ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగు పర్చడంలో సహాయపడతాయి. అయితే వాటిని నేరుగా కాకుండా ఎండిన తర్వాత పొడిగా చేసి తినవచ్చు. డయాబెటిస్ పేషెంట్లకు ఇవి చాలా మంచిది.

యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండటంవల్ల ఈ విత్తనాలను తీసుకోవడంవల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో వాపు వంటి సమస్యలు దూరం అవుతాయి.

అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉండటంవల్ల జామున్ గింజలు మలబద్ధకాన్ని, డయేరియా, అజీర్తి వంటి సమస్యలను నివారిస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల రిస్క్‌ను కూడా తగ్గిస్తాయి. అయితే వాటిని నేరుగా తీసుకోవడం మాత్రం మంచిది కాదు. ప్రాసెస్ చేసిన చూర్ణాన్ని లేదా పొడిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తు్న్నారు.

* గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాల విషయంలో ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. ప్రయత్నించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు. 


Similar News