మత ఘర్షణను తగ్గిస్తున్న దేవుడిపై ఆలోచన.. శత్రువులు మిత్రులైపోతారు : స్టడీ

మతం ఘర్షణలకు దారితీస్తుందని నమ్ముతారు.

Update: 2023-04-26 09:04 GMT

దిశ, ఫీచర్స్: మతం ఘర్షణలకు దారితీస్తుందని నమ్ముతారు. ఇతర రిలీజియన్‌కు చెందిన వారిని శత్రువులుగా భావిస్తారని, తమ మతానికి చెందినవారిని దగ్గరకు తీసుకుంటారనే విశ్వాసం ఉంది. అయితే తాజా అధ్యయనం ఈ నమ్మకం తప్పని నిరూపించింది. దేవుడి గురించి ఆలోచించడం అనేది బయటి వ్యక్తుల పట్ల ఉదారతను పెంచుతుందని, వారికి హెల్ప్ చేసేందుకు కారణమవుతుందని తెలిపింది. మూడు వేర్వేరు ప్రాంతాల్లో(యునైటెడ్ స్టేట్స్, మిడిల్ ఈస్ట్, ఫిజీ) 4700 కంటే ఎక్కువ మందిపై జరిగిన ప్రయోగాల్లో ఈ విషయం గుర్తించబడింది.

ఈ రీసెర్చ్‌‌లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, యూదు సంఘాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారు. పరిశోధకులు వారికి పెద్ద ఎన్వలప్‌లో చిన్న మొత్తంలో డబ్బు ఇచ్చారు. ‘నాకు’, ‘మరొక వ్యక్తికి ఇవ్వచ్చు’ అని లేబుల్ చేయబడిన మరో రెండు చిన్న కవర్స్ కూడా ఇవ్వబడ్డాయి. వారు మొత్తం డబ్బును తమ కోసం ఉంచుకోవచ్చు, అన్నింటినీ ఇవ్వవచ్చు లేదా విభజించవచ్చు. డబ్బు పూర్తిగా ఇవ్వాలనుకునే వారు ‘మరో వ్యక్తికి ఇవ్వచ్చు’ అని రాసిన కవర్‌లో ఆ డబ్బు ఉంచి.. దాన్ని పెద్ద కవర్‌లో వేయాల్సి ఉంటుంది. తమకే కావాలనుకునేవారు ‘నాకు’ అని రాసిన కవర్‌లో మనీ పెట్టి.. దాన్ని పెద్ద కవర్‌లో ఉంచాలి. సగం తనకు, మిగిలినది ఇతరులకు ఇవ్వాలనుకున్న వారు రెండు కవర్లలో డబ్బు పెట్టి బిగ్ ఎన్వలప్‌లో ఉంచాలి. అయితే డబ్బును విభజించేటప్పుడు ఏది మంచిదో ఉత్తమంగా ఆలోచించి చేయమని పాల్గొనేవారికి మొదట చెప్పబడింది. ఆ తరువాత దేవుడు ఏమి చేయాలనుకుంటున్నారో ఆలోచించమని సూచించారు. ఆ తర్వాత ప్రయోగాన్ని కంటిన్యూ చేశారు. ఫలితాల్లో చాలా మంది డబ్బుతో కూడిన పెద్ద కవర్‌ను మరొకరికి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తమ మతానికి చెందిన వారా లేదంటే ఇతరులా అనే తేడా చూపించలేదు.

Also Read...

స్త్రీలు మంగళవారం ఆంజనేయ స్వామిని ఇలా పూజిస్తే ఎంతో మంచిదంట? 

Tags:    

Similar News