భూగోళం సేఫ్.. 100శాతం రీసైకిల్ చేయబడే ప్లాస్టిక్ రూపొందించిన పరిశోధకులు

ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి.

Update: 2023-08-02 09:37 GMT

దిశ, ఫీచర్స్: ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 2050 నాటికి వన్ బిలియన్ టన్నులకుపైగానే పెరుగుతాయని హెచ్చరించింది. అయితే ఇప్పటికే ఉన్న ఏడు బిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల్లో కేవలం 10శాతం మాత్రమే రీసైకిల్ చేయబడగా.. పల్లపు ప్రదేశాల్లో పూర్తిగా విస్మిరించబడుతున్నాయి. ఇవి కాస్త పర్యావరణానికి హాని కలిగిస్తూ.. మానవాళి మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఇప్పటికే తల్లిపాలు, శరీరంలో ప్రవహించే రక్తం కూడా ప్లాస్టిక్‌తో కలుషితం కాగా.. మానవ జాతి అంతరించే పరిస్థితి నెలకొంది. కాగా ఇలాంటి సిచ్యువేషన్‌లో ఓ శుభవార్త అందించారు కాలిఫోర్నియా సైంటిస్టులు. పాలీ డికెటోనామైన్(PDK) అనే రీసైక్లెబుల్ ప్లాస్టిక్‌ను తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పదార్థాన్ని రూపొందించడానికి సూక్ష్మజీవులను విజయంవంతంగా రూపొందించినట్లు తెలిపారు.

ప్రధానంగా బయో-ఆధారితమైన PDKని రూపొందించడానికి బయోప్రొడక్ట్‌లను ఏకీకృతం చేయడం ఇదే మొదటిసారి. PDKని స్థిరంగా ప్రిస్టైన్(ఒరిజినల్ కండిషన్) బిల్డింగ్ బ్లాక్‌లుగా పునర్నిర్మించవచ్చని, నాణ్యతలో క్షీణత లేకుండా కొత్త ఉత్పత్తులుగా మార్చవచ్చని పరిశోధకులు వివరించారు. ముందుగా PDKలు పెట్రోకెమికల్స్ నుంచి తీసుకోబడిన బిల్డింగ్ బ్లాక్‌లను ఉపయోగించాయి. అయితే వీటిని సూక్ష్మజీవుల ద్వారా తిరిగి ఇంజినీరింగ్ చేయవచ్చు, ఉత్పత్తి చేయవచ్చు. నాలుగు సంవత్సరాల పరిశోధన తర్వాత.. E. కోలి బ్యాక్టీరియాను సవరించడం ద్వారా ప్లాంట్ షుగర్స్‌ను ఇనిషియల్ మెటీరియల్స్‌గా కన్వర్ట్ చేయగలిగారు శాస్త్రవేత్తలు. ట్రైయాసిటిక్ యాసిడ్ లాక్టోన్ (బయోటాల్) అని పిలువబడే మాలిక్యూల్ దాదాపు 80 శాతం బయో-కంటెంట్‌తో PDKని ఉత్పత్తి చేసింది. మొత్తానికి పునర్వినియోగపరచదగిన ప్లాస్టిక్‌లలో 100% బయో-కంటెంట్‌కు మార్గం సాధ్యమేనని నిరూపించిన సైంటిస్టులు.. ఈ ప్లాస్టిక్ నుంచి కంప్యూటర్ కేబుల్స్ లేదా వాచ్ బ్యాండ్‌లు వంటి సౌకర్యవంతమైన వస్తువులు తయారు చేయవచ్చని ప్రకటించారు.


Similar News