ట్రెండింగ్ పిక్ : ప్లేట్‌లో దానికి కూడా స్థానం ఇచ్చేశాడు ?

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మనుషులు మొబైల్ చేతిలో కీలుబొమ్మలయ్యారు.

Update: 2022-03-06 02:59 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మనుషులు మొబైల్ చేతిలో కీలుబొమ్మలయ్యారు. ఏ పనిచేస్తున్నా సరే ఫోన్ వాడకం తప్పనిసరి అయిపోయింది. పడుకునేటప్పుడు తప్పా మిగతా సమయంలో మొబైల్ స్క్రీన్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. చివరకు వాష్ రూమ్ వెళ్లేటప్పుడు కూడా ఫోన్ వదలని మహానుభావులున్నారంటే అతిశయోక్తికాదు. ఇక తినేటప్పుడు మొబైల్ స్వైప్ చేయడం కష్టమవుతోందని.. ఏకంగా ప్లేట్‌లోనే స్థానం ఇచ్చేశాడు మరో గొప్పవ్యక్తి. ఒక వైపు కర్రీ, చట్నీ, సాంబార్, పరోటా, రైస్‌ వంటి వైరటీస్‌కు పళ్లెంలో చోటిస్తూనే.. మొబైల్‌కు కూడా ప్లేట్‌లో స్పెషల్ స్పేస్ ఇచ్చాడు. ఈ పిక్చర్ కాస్తా 'న్యూ జనరేషన్ ప్లేట్' పేరుతో వైరల్ అవుతుండగా.. మొబైల్‌తో ఎంత విడదీయరాని బంధమో చెప్పకనే చెప్పేశాడు సదరు వ్యక్తి. 

Tags:    

Similar News