Powerful Bird :సింహాన్ని ఒక్క కిక్కుతో చంపేసేంత బలం.. కానీ తనను తాను పూడ్చి పెట్టుకుంటున్న పక్షి.. ఎందుకంటే?

ఆస్ట్రిచ్.. పక్షులన్నింటిలోనూ ఎత్తైనది, బరువైనది కూడా. కానీ వాటి తల మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. శత్రువల నుంచి తమను తాము కాపాడుకునేందుకు సహాయపడే ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఒక్క కిక్కుతో సింహాన్ని కూడా

Update: 2024-07-23 05:06 GMT

దిశ, ఫీచర్స్ : ఆస్ట్రిచ్.. పక్షులన్నింటిలోనూ ఎత్తైనది, బరువైనది కూడా. కానీ వాటి తల మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. శత్రువల నుంచి తమను తాము కాపాడుకునేందుకు సహాయపడే ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఒక్క కిక్కుతో సింహాన్ని కూడా చంపేంత బలం కలిగిన ఈ నిప్పుకోడి.. ఇసుకలో తమ తలను తామే పూడ్చుకుంటాయనే ప్రచారం ఉంది. కానీ ఇదంతా అవాస్తవమని చెప్తున్నారు పరిశోధకులు.

నిజానికి ఏదైనా ఆపద తలెత్తతినప్పుడు ఎనిమీ నుంచి బయటపడేందుకు ఇలా భూమి మీద పడుకుంటాయి. ఉపరితలంపై మెడను పొడవుగా స్ట్రెచ్ చేస్తాయి. ఈకలను ఆ గ్రౌండ్ కలర్‌కు తగినట్లుగా మార్చుకుంటాయి. ఇది కాస్త ఆస్ట్రిచ్ తనను తాను పూడ్చుకున్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఇదంతా అపోహ అని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్. ఇదొక ఆప్టికల్ ఇల్యూజన్ అని అంటున్నారు. ఎందుకంటే భూమిలో లేదా ఇసుకలో అలా తల దూర్చినట్లయితే.. అవి శ్వాస తీసుకోలేవని చెప్తున్నారు.

ఇసుకలో గుంతలు తవ్వి అందులో గుడ్లు పెట్టే ఆస్ట్రిచ్.. రోజులో కొన్నిసార్లు వాటిలోకి తలదూర్చి గుడ్లను టర్న్ చేస్తుంటాయి. అలాంటప్పుడు తల ఇసుకలోపలికి పోయినట్లు కనిపిస్తుంది. కాబట్టి దీనిపై కొన్ని సామెతలు కూడా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. సమస్యలు ఎదురైనప్పుడు తప్పించుకునే పరిస్థితిలో వీటిని వాడుతుండగా.. అసలు నిజం అది కాదని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఇక క్యామెల్ బర్డ్‌గా కూడా పిలవబడే నిప్పుకోడి.. పొడవైన మెడ, పెద్ద కళ్లు, లాంగ్ ఐ ల్యాషెస్ కలిగి ఉంటాయి. ఒంటెల మాదిరిగానే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ కొన్ని రోజులపాటు నీళ్లు లేకపోయినా జీవించగలవు.

Tags:    

Similar News