స్త్రీ లైంగికతపై ఆసక్తికర నిజాలు.. నమ్మాల్సిందే!
మహిళల సెక్స్ జీవితం పట్ల స్టీరియోటైపిక్ సొసైటీలో పలు అనధికారిక షరతులు కొనసాగుతూనే ఉన్నాయి.
దిశ, ఫీచర్స్ : మహిళల సెక్స్ జీవితం పట్ల స్టీరియోటైపిక్ సొసైటీలో పలు అనధికారిక షరతులు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వారు కూడా సెక్స్‌ను ఆస్వాదిస్తారనే వాస్తవాన్ని ప్రపంచం సైతం అంగీకరించాలి. ఇందుకోసం స్త్రీ లైంగికత చుట్టూ అలుముకున్న అనేక అపోహలను ఛేదించాల్సిన అవసరముంది. ముఖ్యంగా మహిళలు తమ లైంగిక కోరికల గురించి తెలుసుకోవాలి. ఆశిస్తున్న విషయంపై స్పష్టత కలిగి ఉండాలి. లేదంటే ప్రచారంలో ఉన్న అపోహలు తమ లైంగిక సంతృప్తిని ప్రభావితం చేస్తాయి. ఇంతకీ అవేంటో చూద్దాం.
* యోని సంభోగంతోనే మహిళల్లో భావప్రాప్తి :
యోని సంభోగం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ చాలా మంది మహిళలు ప్రధానంగా క్లిటోరల్ స్టిమ్యులేషన్ ద్వారా భావప్రాప్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అంటే స్త్రీలు అంగప్రవేశంతో కూడిన శృంగారంతో భావప్రాప్తి పొందినప్పటికీ ఈ విషయంలో క్లిటోరిస్ స్టిమ్యులేషన్ ప్రధాన వనరుగా నిరూపించబడింది. అందుకే మహిళలు రతిక్రీడలో తమకు నచ్చిన చర్య గురించి భాగస్వామికి సరిగ్గా చెబితే.. సులభంగా భావప్రాప్తి పొందగలరని సూచిస్తున్నారు.
* మహిళలు సెక్స్ కోరికలు తక్కువ
ఇది తరచూగా వినబడే అపోహ. మగవారిలాగే స్త్రీలు కూడా సెక్స్‌ను కోరుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే తమ కోరికలను ఓపెన్‌గా బహిర్గతపరిస్తే 'స్లట్'గా ముద్ర వేస్తారనే భయంతో వారు తమ కోరికలను వ్యక్తం చేయడానికి వెనకాడతారు. పైగా మహిళలు హెల్తీ సెక్స్ డ్రైవ్‌ను కలిగి ఉండటం వల్ల వారిలో ఏదైనా లోపముందా అని కూడా ఆశ్చర్యపోతారు. కానీ మిమ్మల్ని మీరు సంతృప్తిపరచాలనే కోరిక కలిగి ఉండటంలో తప్పు లేదు. దానికి అర్హులు, తప్పకుండా పొందాల్సిందే.
* మహిళలు హస్తప్రయోగం చేయరు
ఇది కూడా అపోహే. ఎందుకంటే పురుషుల మాదిరిగానే స్త్రీలకు కూడా తరచూ యోనిలోకి ప్రవేశించడం ద్వారా తీరని అవసరాలు ఉంటాయి. ఈ క్రమంలోనే మహిళల కోసం అనేక రకాల సెక్స్ టాయ్స్ అందుబాటులో ఉన్నాయి. నిజానికి వాటితో తమకు కావలసిన ప్లెజర్ పొందగలిగితే ఇక భాగస్వామి అవసరం కూడా ఉండదేమో!
* సెక్స్ పార్ట్నర్తో ఎమోషనల్ అటాచ్మెంట్
సెక్స్ అనేది స్త్రీ హృదయానికి సంబంధించినది కాదనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి ఎటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ లేకున్నా క్యాజువల్ సెక్స్‌లో ప్లెజర్‌ను అనుభవించే సామర్థ్యముంది. నిజానికి ప్రేమించే వ్యక్తితో బెడ్‌పై ఎమోషనల్ కనెక్షన్ ఇష్టపడతాం. కానీ ఒంటరి స్త్రీలు ఇవేవీ లేకుండా వన్-నైట్ స్టాండ్ ఆశ్రయించడంలో తప్పు లేదు కదా.
Also Read: లూజ్ వెజీనాతో ఆందోళన అక్కర్లేదు.. టైటెనింగ్‌కు సింపుల్ టిప్స్