Munagaku: మునగాకు ఎన్ని రకాల రోగాలను నయం చేయగలదో తెలుసా?
ఎన్నో ఏళ్ల నుంచి మన పూర్వీకులు మునగాకు మందులు తయారీలో వాడుతున్నారు
దిశ,వెబ్ డెస్క్ : ఎన్నో ఏళ్ల నుంచి మన పూర్వీకులు మునగాకు మందులు తయారీలో వాడుతున్నారు. ఈ ఆకుతో 300 రోగాలను నయం చేసే ఔషధ గుణాలున్నాయని పరిశోధనలు చేసి వెల్లడించారు. వీటిలో విటమిన్స్ , అమైనో యాసిడ్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి.
1. కీళ్ల నొప్పులు , అర్ధరైటిస్ ప్రారంభ దశలో ఉంటేమునగాకు నూరి కడితే నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. మెత్తగా ఈ ఆకు నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మ రోగాలు తగ్గుతాయి.
2. మునగాకు రసాన్ని తాగితే కంటి సమస్యలు, రేచీకటి నివారిస్తుంది.
3. మునగాకు రసాన్ని పాలలో కలిపి అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి.