అమ్మకు ప్రేమతో.. ఈ స్టోరీలోని మ్యాజిక్ తెలియాలంటే.. చదవాల్సిందే!

తొలిసారి వెలుతురును చూశాక ఓ స్పర్శ నన్ను ఆత్మీయంగా తడిమింది.. నాకు ‘‘ నేను ఉన్నాను భరోసా ఆ చేతి స్పర్శ లో కనబడింది.. తర్వాత చందమామ రావే.. జాబిల్లి రావే అంటూ నాలో ఉత్సాహాన్ని నింపింది.’’ ఇక నేను పెరుగుతుంటే తెలిసింది.

Update: 2024-05-11 10:26 GMT

దిశ, ఫీచర్స్ : తొలిసారి వెలుతురును చూశాక ఓ స్పర్శ నన్ను ఆత్మీయంగా తడిమింది.. నాకు ‘‘ నేను ఉన్నాను భరోసా ఆ చేతి స్పర్శ లో కనబడింది.. తర్వాత చందమామ రావే.. జాబిల్లి రావే అంటూ నాలో ఉత్సాహాన్ని నింపింది.’’ ఇక నేను పెరుగుతుంటే తెలిసింది.. ఆ స్పర్శ ఎవరిదో కాదు నన్ను ఈ లోకానికి పరిచయం చేసిన మా అమ్మది. ఇక అమ్మ గురించి రాయాలంటే ఈ పేజీలు సరిపోవు.. ఎంత మంది కవులు ఎన్ని కవితలు రాసినా తన గొప్పతనాన్ని వర్ణించలేరు .. అమ్మ గొప్పతనం అంత గొప్పది. అందుకే అంటారు.. ‘‘అమ్మ ఒడి ఓ అద్భుతమైన గుడి.. తన ఒడిలో తానై మరిచిన తరుణం..జీవితంలో ఓ మధుర క్షణం.. కొంగు పట్టి నడిచే క్షణం.. ప్రతి బిడ్డకు అదే సువర్ణ మార్గం.. అమ్మే అద్భతం.. అమ్మ ఒడినే ఓ మధుర జ్ఞాపకం. సమాజంలో కూడా అమ్మ పాత్రే కీలకం.’’

అమ్మ గురించి పొగడటం అనేది చాలా కామన్. ప్రతి బిడ్డకు తన తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. కన్నవారికి తన తల్లి అంటే ఎంత ఇష్టమో.. అంతకు వందరేట్లు ఆ తల్లి తన కడుపున పుట్టిన వారిపై ప్రేమను చూపిస్తుంది. తన బిడ్డ కడుపు నింపిన తర్వాతే తాను తినడానికి ఇష్టపడుతుంది. తన కడుపు మాడ్చుకొని తన పిల్లల కడుపు నింపిన ఎంతో మంది తల్లులు ఈ సమాజంలో ఉన్నారు. కానీ ప్రస్తుతం తల్లిని చూసే విధానంలో చాలా తేడాలు వచ్చాయి అనడంలో అతిశయోక్తి లేదు. అమ్మ గొప్పతనం వర్ణించడం కాదు.. తన గుండెలో బాధ, తనకు ఏం కావాలో తెలుసుకోవాల్సిన ఒక బిడ్డ తనకు కావాలి.

ఉదయం లేచిందంటే చాలు.. ఇంటిని శుభ్రపరచడంలో నిమగ్నం అవుతుంది. ఇక భర్త టీ,టిఫిన్ అంటూ అరుస్తాడు. అలాగే పిల్లలు కూడా నువ్వు ఇంటికాడే కదా ఏం చేస్తున్నావ్.. నాకు ఈ పని చేసి పెట్టు, అ పని చేయు అంటూ ఆమె ఆరోగ్యంగా ఉందా? లేదా అని కూడా పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తారు. ఇంకొంత మంది తన తల్లిని చులకన చేసి మాట్లాడటం.. ఏ మా అమ్మకు ఏం తెలియదు అంటూ కొట్టిపారేయడం. ఏంట్రా.. బాబు ఈరోజు బాధలో ఉన్నావు ఏమైంది అని అడిగితే.. నీకు ఏం తెలుసని నన్ను అడుగుతున్నావు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ తన చిన్ని మనసును బాధ పెడతారు తప్ప తన తల్లి మనసు అర్థం చేసుకోరు. ఈ రోజుల్లో ఒక భర్త, కొడుకు, చివరికి కూతురు కూడా తన తల్లి ఆలన పాలన చూసుకోవడంలో విఫలం అవుతున్నారని చెప్పవచ్చు.

బాల్యం అలా.. వృద్ధప్యం‌లో ఇలా..

మన చిన్నప్పుడు అమ్మ పక్కన లేకపోతే ఏడుస్తారు. తన తల్లి తనను వదిలి పనికి వెళ్లిందని గావరా పడిపోతుంటారు. కానీ తనకు పెళ్లై, పిల్లలు పుట్టాక, తన పక్కన తల్లి ఉంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. మనం రోజూ ఎన్నో సంఘటనలు చూస్తుంటాం.. ‘‘రోడ్డున పడిన 60 ఏళ్ల వృద్ధురాలు.. పట్టించుకోని పిల్లలు’’ ఇది కాదు కదా ఒక తల్లి మీ నుంచి కోరుకునేది. తాను మిమ్మల్ని ప్రాణంగా పెంచింది, మీరు బాగుండాలని, తనకు ఓ ముద్ద పెట్టాలని. కానీ అలాంటి ఎంతో మంది తల్లులను రోడ్డు పాలు, అనాధశ్రమం పాలు చేస్తున్న పిల్లలున్నారు ఇంకా ఈ సమాజంలో.

అమ్మ ప్రేమ సోషల్ మీడియాకే పరిమితమా?

అమ్మ ప్రేమను తెలపడానికి సోషల్ మీడియానే కావాలా? మదర్స్ డే వస్తే చాలు.. వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లో..‘‘ నీవే నీవే నీవే.. నేను అంట.. నీవే లేక’’..‘‘పెదవే పలికిన మాటల్లోన తీయని ప్రేమే అమ్మ’’ అంటూ స్టేటస్, స్టోరీస్ పెడుతుంటారు. కానీ తాను కోరుకునేది అది కాదు తమతో కాసేపు ప్రేమగా మాట్లాడటం. తన బాధలను పంచుకవడం, అలా చేస్తే వారు సంతోషంగా ఉండగలుగుతారు. అందువలన వారిని సంతోషంగా ఉంచాలి అంటే ఒక్క రోజు స్టేటస్ కాకుండా.. ప్రతి రోజు ఆమెతో గడపాలి.

అమ్మ మసిగుడ్డ కాదు కదా..

అమ్మ జీవితం వంటింట్లోని ఓ మసిగుడ్డ లా తయారైంది. ఎందుకంటే తనను పట్టించుకునేవారే కరువు. ప్రొగ్రెస్‌లో సైన్ పెట్టాలంటే నాన్న.. ఏదైనా మాట్లాడలంటే నాన్న.. డబ్బల విషయంలో నాన్న.. తమ అవసరాలు తీరస్తున్నాడు కాబట్టి నాన్నే కష్టపడుతున్నాడు. అమ్మ ఇంట్లో ఉంటుంది. ఇది కాదు కదా.. అమ్మ చేసే పని ఎవరూ చేయలేనిది. ఒక కుటుంబాన్ని చూసుకోవడానికి మించిన పెద్ద జాబ్ ఏదీ ఉండదు. కానీ వాటిని ఎవరూ పట్టించుకోరు.

సమాజంలో వారంటే చిన్న చూపు..

ప్రస్తుతం చాలా మంది మహిళలు సరోగసి, లేదా దత్తత తీసుకొని పిల్లలను పెంచుతున్నారు. అయితే వారికి సామాజిక మద్దతు ఉంటుందా అంటా? డౌట్ అనే చెప్పాలి. ఒంటరి తల్లులను సమాజం చిన్న చూపుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. వారు ఎంత దృఢంగా ఉన్నా.. కొన్ని సందర్భాలు వారిని మానసికంగా కుంగిపోయేలా చేస్తుంటాయి. అందువల్ల వారికి అందరి సపోర్ట్ ఉండటం అవసరం.

అమ్మకు ఆ అర్హత లేదా?

ఈ మధ్య విడాకులు అనేది చాలా ట్రెండ్ అయిపోయింది. చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. ఒక వేళ వారికి పిల్లలు ఉన్న వారిని తామే పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో వారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంతే కాకుండా కొంత మంది పిల్లలను దత్తత తీసుకోని పెంచుకోవాలని చూస్తున్నారు. అయి వారిని చట్టం ఒప్పుకోవడం లేదు. ఆ పిల్లలకు సంరక్షకుడు ఎవు అనే ప్రశ్న వారికి ఎదురవుతుంది. సింగిల్ మదర్స్‌కు గార్డియన్‌గా ఉండే చాన్స్ లేదు.. తండ్రి తర్వాతే ఆమె స్థానం. కానీ ఇలాంటి పరిస్థితి పోవాలి. ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు దూసుకపోతున్నారు. ఇది గమనించాల్సిన అంశం అని నా అభిప్రాయం.

నేను తల్లినయ్యాకే తెలిసింది..

ఇక అమ్మ గురించి ఇప్పటివరకు చెప్పింది ఒకటైతే, ఇప్పుడు చెప్పేది ఇంకో ఎత్తు. ఎందుకంటే ఏదైనా కానీ అనుభవిస్తే కాని తెలియదు అంటారు. నాకు అమ్మ అంటే ఇష్టం. కానీ నేను అమ్మను అయ్యాక తెలిసిందే.. నాది ప్రేమ మాత్రమే కానీ మా అమ్మది నాకంటే ఎక్కువ అని. అందుకే అంటారు.. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు. అమ్మ లేనిదే జన్మే లేదు..ఈ సృష్టే లేదు.

అమ్మకు ప్రేమతో..

నా జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకం అమ్మ

నా బాధలో భరోసానిచ్చే నా బలం అమ్మ

నా సంతోషంలో తోడు నిలిచే చిరు నవ్వు అమ్మ

నా కష్టంలో పాలు పంచుకునే ధైర్యం అమ్మ

నా కు అన్ని వేళలలా అండగా ఉండే నీడ అమ్మ.. అందుకే?

నా ప్రపంచం అమ్మ.. హాప్పీ మదర్స్ డే ..

Read More...

అమ్మే సర్వస్వం.. ప్రేమకు ప్రతిరూపం.. 


Similar News