తల్లితో ఫోన్‌ మాట్లాడితే ఒత్తిడి నుంచి దూరం..

పెళ్లి తర్వాత అమ్మాయిలు పుట్టింటికి దూరం కావడం కామన్.

Update: 2023-08-25 11:28 GMT

దిశ, ఫీచర్స్: పెళ్లి తర్వాత అమ్మాయిలు పుట్టింటికి దూరం కావడం కామన్. దీంతో ఎప్పుడూ వెంటే ఉండే అమ్మ కౌగిలింతతో తన సమస్యలు, ఒత్తిడి నుంచి ఇట్టే బయటపడే గర్ల్స్.. మ్యారేజ్ అయ్యాక మాత్రం వీటన్నింటిని కోల్పోయి బాధపడుతూ ఉంటారు. అయితే తాజా అధ్యయనం ప్రకారం తల్లితో ఫోన్ కాల్ మాట్లాడినా సరే కౌగిలింతలో పొందే అనుభూతిని పొందుతారని, అమ్మ స్వరంతో కూడిన ఓదార్పు మాటలు స్ట్రెస్‌ నుంచి రిలీఫ్ కలిగిస్తాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. తల్లి మాటలు బాడీలో ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ను విడుదల చేసి స్ట్రెస్ బస్టర్స్‌గా పనిచేస్తాయని వివరించారు.

యూఎస్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఏడు నుంచి 12ఏళ్ల వయస్సు గల 61 మంది బాలికలపై చేసిన ప్రయోగంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. పిల్లలకు ఆకస్మికంగా స్పీచ్ కాంపిటీషన్స్ నిర్వహించాలని, గణిత సమస్యలను పరిష్కరించాలని కోరారు సైంటిస్టులు. దీంతో వారిలో ఒత్తిడి పెరిగి కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు పెరిగిపోయాయి. ఇప్పుడు అమ్మాయిలను మూడు గ్రూపులుగా విభజించారు. తొలి గ్రూప్ వారిని తల్లులతో నేరుగా కలిపించగా.. రెండో గ్రూప్‌ పిల్లలను అమ్మలతో ఫోన్ కాల్‌ మాట్లాడాలని సూచించారు. ఇక మూడో గ్రూప్ వారిని మార్చ్ ఆఫ్ ది పెంగ్విన్స్ అనే చిత్రాన్ని చూడాలని తెలిపారు. ఫలితాల్లో ఫస్ట్, సెకండ్ గ్రూప్స్‌లో ఆక్సిటోసిన్ ఒకే స్థాయికి పెరగ్గా.. మూడో గ్రూప్‌లో మాత్రం కనిపించలేదు. కాగా లాలాజలం, మూత్ర పరీక్షల ద్వారా ఈ ఎక్స్‌పరిమెంట్ రిజల్ట్ కనుగొన్నారు సైంటిస్టులు.

Read More:   బ్రెయిన షార్ప్‌గా పనిచేయాలా?.. ఇలా చేయడం బెటర్


Similar News