Most Educated country : అక్కడంతా చదువుకున్నోళ్లే.. ప్రపంచంలోనే ఎక్కువ అక్షరాస్యత ఉన్న దేశం ఇదే !

Most Educated country : అక్కడంతా చదువుకున్నోళ్లే.. ప్రపంచంలోనే ఎక్కువ అక్షరాస్యత ఉన్న దేశం ఇదే !

Update: 2024-09-30 07:31 GMT

దిశ, ఫీచర్స్ : చదువే మనిషికి జ్ఞానం. చదువే మనిషికి జీవం అంటారు పెద్దలు. చదువుకోవడం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. జీవితంలో ఎలా బతకాలో, ఎలా నడచుకోవాలో తెలియజేస్తుంది చదువు. అందుకే దానికంత విలువ. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ చదువుకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐదంకెల జీతం గల ఉద్యోగాలు సంపాదించాలంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ముఖ్యమని భావిస్తున్నారు. ఓ వైపు బాగా చదువుకుంటున్నవారు ఉంటున్నారు. అదే సందర్భంలో చదువుకునే అవకాశాల్లేనివారు, తక్కువ చదువుకుంటున్నవారు, అసలు చదువుకే దూరంగా ఉంటున్నవారు కూడా పలు దేశాల్లో ఉంటున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్’ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం.. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో విద్యావంతుల శాతమెలా ఉందో తెలుసుకుందాం.

విద్యావంతులు ఎక్కువగా ఉన్న దేశాలేవి? ఈ సందేహం తలెత్తినప్పుడు చాలామంది అమెరికా లేదా ఇంగ్లాండ్ కావచ్చు అనుకుంటారు. కానీ అది నిజం కాదంటున్నారు నిపుణులు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు వరల్డ్‌లోనే అత్యధికమంది ఎడ్యుకేటర్స్ ఉన్న దేశం కెనడా. ఇక్కడ 59.96 శాతం మంది అక్షరాస్యులు ఉన్నారు. ఇక 52.68 శాతం విద్యావంతులు కలిగిన దేశంగా జపాన్ రెండవ స్థానంలో నిలిచింది. లక్సెంబర్గ్ మూడవస్థానంలో ఉండగా, దక్షణి కొరియా, ఇజ్రాయెల్ 4, 5 స్థానాల్లో నిలిచాయి. అమెరికా, బ్రిటన్ 6, 8 స్థానాల్లో నిలిచాయి. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుండవచ్చు. కానీ ప్రపంచంలో ఎక్కువమంది విద్యావంతులుగల దేశాల జాబితాలో ఇండియా పేరు లేదు. అయితే ఓఈసీడీ (Organization for Economic Co-operation and Development.) రిపోర్ట్ ప్రకారం మన దేశ జనాభాలో అక్షరాస్యత రేటు 20.4 శాతంగా ఉంది. ఇక నేషనల్ స్టాటిస్టికల్ స్టడీ గత నివేదికల ప్రకారం.. భారత్‌లోని ఏడు రాష్ట్రాల్లో అక్షరాస్యత శాతం తక్కువగా ఉంది. ఎక్కువ విద్యావంతులు కలిగిన రాష్ట్రంగా కేరళ మొదటిస్థానంలో ఉంది. 


Similar News