పెళ్లికి ముందు.. అమ్మాయి, అబ్బాయి ఈ తప్పులు అస్సలు చేయకూడదు

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అద్భుతమైన ఘట్టంగా చెప్పవచ్చు. అందువలన పెళ్లి కోసం నెల, రెండు నెలల ముందు నుంచే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటారు.

Update: 2022-09-07 08:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అద్భుతమైన ఘట్టంగా చెప్పవచ్చు. అందువలన పెళ్లి కోసం నెల, రెండు నెలల ముందు నుంచే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక వధువరులైతే రెస్ట్ లేకుండా షాపింగ్ చేస్తుంటారు.

ఆరోజు ప్రతి ఒక్కరి ఫోకస్ వారి మీదనే ఉంటుంది కాబట్టి వారు అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో బ్యూటి టిప్స్ ఫాలో అవుతుంటారు. అయితే పెళ్లికి ఐదురోజు ముందు నుంచి వధూ వరులు ఇలాంటి తప్పులు చేయకూడందట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లికి ఐదు రోజుల ముందు అమ్మాయిలు, కానీ అబ్బాయిలు కానీ ఈ తప్పులు అస్సలు చేయకూడదు. అవి ఏమిటంటే?

  • అబ్బాయిలు చాలా వరకు పెళ్లికి ముందు అల్కహాల్ తీసుకోవడం వలన గ్లో వస్తుంది అనుకుంటారు. అందువలన ఎక్కువగా బీర్లు తాగుతారు. కానీ అలా మద్యం తాగడం వలన శరీరానికి విపరీతంగా చెమటలు పడుతాయంట. తద్వారా ఫేస్ పాడయ్యే అవకాశం ఉందంట.
  • అమ్మాయిలు పెళ్లి కోసమని కొత్త కొత్త ఫేస్ క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు. అయితే అలా ఫేస్ క్రీమ్స్ మంచికాదంటున్నారు. ఒక వేళ అవి పడకపోతే స్కిన్ ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది.
  • పెళ్లి అనే ఆనందంలో వధూవరులు నిద్రమానుకొని మరి ఫొన్ మాట్లాడుతుంటారు. అయితే నిద్ర లేకపోవడం వలన పెళ్లి రోజు ఉత్సాహంగా ఉండరంట. అందువలన పెళ్లికి ముందు ఎక్కువగా నిద్రపోవాలి.

ఇవి కూడా చ‌ద‌వండి  గర్ల్‌ఫ్రెండ్ ఫొటోలను బాయ్స్ ఆన్‌లైన్‌లో ఎందుకు పోస్ట్ చేయరు? 


Similar News