నేడే అక్షయతృతీయ.. ఈ తప్పులు అస్సలే చేయకండి

అక్షయతృతీయ రోజును చాలా పవిత్ర రోజుగా కొలుస్తారు. ఈరోజు బంగారం కొనుగోలు చేయడం ద్వారా మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. అందుకే చాలా మంది మహిళలు ఈరోజు ఉదయం

Update: 2023-04-22 03:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అక్షయతృతీయ రోజును చాలా పవిత్ర రోజుగా కొలుస్తారు. ఈరోజు బంగారం కొనుగోలు చేయడం ద్వారా మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. అందుకే చాలా మంది మహిళలు ఈరోజు ఉదయం లేచిన వెంటనే లక్ష్మీదేవిని పూజించి, బంగారం కొనుగోలు చేయడానికి వెళ్తుంటారు. కానీ వారు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు. దాని వలన అరిష్టం చుట్టుకునే అవకాశం ఉన్నదంట. అందువలన అక్షయతృతీయ రోజు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అక్షయతృతీయ రోజు లక్ష్మీ దేవితో పాటు, విష్ణు మూర్తిని కూడా పూజించాలంట. అలా చేస్తే ఆర్థికబాధల నుంచి బయటపడతారంట.

2అక్షయ తృతీయ నాడు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే.. తప్పనిసరిగా ఇంటికి తీసుకు వెళ్లాలంట. లేకపోతే కొనుగోలు చేసిన ఫలితం ఉండదు అంటున్నారు పండితులు.

3.ఈ పవిత్రమైన రోజు ప్రతీ గదిలో కూడా కాంతిని అనుమతించాలి. ఇంట్లో ఏ గదిని కూడా చీకటిగా ఉంచకూడదు.

4. షాపింగ్ కి వెళ్లితే.. ఖాళీ చేతులతో తిరిగి రాకుండా చూసుకోండి. బంగారం, వెండి కాకపోయినా ఇంటికి సంపద కావాలంటే మెటల్ నగలు కొనాలి.

5.నిర్ణత కాలం పాటు ఉపవాసం కొనసాగించాలి.మధ్యలో వేగంగా చేయడం అశుభాన్ని కలిగిస్తుంది. 

Tags:    

Similar News