పైసలు ఎక్కువైతే ఇలాంటి రోగాలే వస్తాయి.. అందానికే కోట్లు కుమ్మరిస్తున్న మిలియనీర్
పైసలు ఎక్కువ ఉన్నోళ్లకు ఇలాంటి రోగాలే వస్తాయి’ అన్న సినిమా డైలాగ్ గుర్తుందా. ఈ యాంటీ ఏజింగ్ యాక్టివిస్ట్, మిలియనీర్‌ను చూస్తే అదే గుర్తొస్తుంది. 46ఏళ్ల
దిశ, ఫీచర్స్: ‘పైసలు ఎక్కువ ఉన్నోళ్లకు ఇలాంటి రోగాలే వస్తాయి’ అన్న సినిమా డైలాగ్ గుర్తుందా. ఈ యాంటీ ఏజింగ్ యాక్టివిస్ట్, మిలియనీర్‌ను చూస్తే అదే గుర్తొస్తుంది. 46ఏళ్ల బ్రియాన్ జాన్సన్ 20ఏళ్ల యంగ్ బాయ్‌లా కనిపించేందుకు ప్రాజెక్ట్ బ్లూప్రింట్ ఫాలో అయినట్లు తెలిపాడు. ఇందులో భాగంగా స్పెషలైజ్డ్ డైట్, 100 డైలీ సప్లిమెంట్స్ యూజ్ చేశానని.. ఇందుకోసం ఏడాదికి రూ. 16కోట్లు వెచ్చించినట్లు వివరించాడు. తన ట్రాన్స్‌ఫర్మేషన్‌ను సూచిస్తూ 2018,2023, 2024లో తన ఫేస్ ఎలా ఉందో కంపేర్ చేస్తూ పిక్చర్స్ షేర్ చేశాడు. ఇదే యాంటీ-ఏజింగ్‌కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని ట్వీట్ చేశాడు. తన రూపురేఖలు మారడాన్ని చూసి తన ఫేస్ ఐడీ కూడా కన్ఫ్యూజ్ అవుతుందని తెలిపాడు.
అయితే ఈ పోస్ట్‌కు రెండు మిలియన్ వ్యూస్ రాగా కామెంట్స్ మాత్రం భిన్నంగా ఉన్నాయి. ‘నువ్వు అనుకున్నట్లు కనిపించట్లేదు బ్రదర్. యాంటీ-ఏజిం ఎఫెక్ట్ కంప్లీట్ అపోజిట్‌గా ఉంది’ అని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ‘సో క్రేజీ..2018లో నువ్వు అంత బెటర్‌గా ఎలా కనిపించావ్?’, ‘ఇంట్రెస్టింగ్‌గా హెయిర్ కలర్ బ్లాక్ అయింది కానీ బాడీకి కూడా మినరల్స్ సప్లయ్ అయితే బాగుండేది’ అని విమర్శిస్తున్నారు. డబ్బును ఇలా వేస్ట్ చేయడం కన్నా సామాజిక కార్యక్రమాలకు వినియోగించవచ్చు కదా అని సలహా ఇస్తున్నారు ఇంకొందరు.
Even my Face ID is confused. I'm transitioning... pic.twitter.com/6AU5mtU5j6
— Zero /dd (@bryan_johnson) April 9, 2024