FISH PICKLE సండే సాయంత్రం వేళ.. నోరూరించే హెల్దీ ఫిష్ పచ్చడి ఇలా రెడీ చేయండి!

ఫిష్ తినడం వల్ల అనేక లాభాలున్నాయి. చేపల ద్వారా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి.

Update: 2024-07-21 12:34 GMT

దిశ, ఫీచర్స్: ఫిష్ తినడం వల్ల అనేక లాభాలున్నాయి. చేపల ద్వారా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ఇవి మనిషిని స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా పిష్‌లో ఉండే విటమిన్ డి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది. టెన్షన్‌ను దూరం చేస్తాయి. మానసిక ఆరోగ్య సమస్యలను అరికట్టడానికి ఫిష్ చాలా మేలు చేస్తుంది. కాగా చికెన్, మటన్‌లాగే చేపలకు ఎక్కువగా ప్రియార్టీ ఇచ్చి.. అధికంగా తిన్నట్లైతే సంపూర్ణమైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకున్నట్లైతే సంతోషంగా, హెల్దీగా ఉండొచ్చు.

పైగా డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. మరీ చేపల కర్రీ రోజూ వండుకోవడం అంటే కుదరని పని కదా అనుకుంటున్నారా? ఈ సందేహం చాలా మందిలో వచ్చే ఉంటుంది.. అందుకు మీ కోసం ఓ ఐడియా. ఫిష్ పచ్చడి చేసుకున్నట్లైతే.. ఓ వారం పాటు మీరు అన్నంలో యాడ్ చేసుకుని తినవచ్చు. అయితే నేడు సండే కాబట్టి.. సాయంత్రం వేళ ఓసారి చేపల పచ్చడి రెడీ చేసి చూడండి. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. మరీ ఫిష్ పచ్చడి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

చేపల పచ్చడికి కావాల్సిన పదార్థాలు..

ఫిఫ్ ముక్కలు, ఆయిల్, పసుపు, అల్లం, కారం, సాల్ట్, వెల్లుల్లి ఫేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, నిమ్మరసం.

ఫిష్ చట్నీ తయారీ విధానం..

ముందుగా చేప ముక్కలను ఫ్రెష్ గా కడుక్కోవాలి. తర్వాత సాల్ట్ వేసి కలిపి, 30 నిమిషాల వరకు అలా ఉంచాలి. అనంతరం స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. 5 నిమిషాలయ్యాక వెల్లుల్లి, ఎండు మిర్చి వేసి పక్కనుంచిన ఫిష్ ముక్కల్ని కడాయిలో వేయాలి. ఫిష్ ముక్కలు రెండు వైపులా బాగా ఆయిల్ లో వేగేలా చూడాలి. అంతా ఫ్రై అయ్యాక.. గరం మసాలా, కారం, పసుపు, ధనియాల ఫౌడర్ వేసి మిక్స్ చేయాలి. లాస్ట్‌కు కాస్త నిమ్మరసం యాడ్ చేసుకుంటే ఆహా ఆ రుచే వెరబ్బా. దీన్ని ఓ చిన్న జాడితో పెట్టి మూత పెట్టి ఓ వారం పాటు ఉపయోగించుకోవచ్చు


Similar News