వారానికి 2 సార్లు sex చేస్తే మగాళ్లకు మాత్రమే కలిగే లాభం..?!
కేవలం పురుషుల్లో మాత్రమే పని చేస్తున్నట్లు తెలుసుకున్నారు. Men who have more sex also have healthier blood vessels.
దిశ, వెబ్‌డెస్క్ః సెక్స్యువల్ జీవితం ఎంత సంతోషంగా ఉంటే మనిషి అంత ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. అయితే, మితిమీరినది ఏదైనా అది వెర్రితనానికీ దారి తీస్తుందని నిపుణులు చెబుతారు. అందుకే, పరిణితి చెందిన వయసు వారిలో సెక్స్ సుఖంతో పాటు ఆరోగ్యానికీ కారణమవుతుంది. తైవాన్‌లోని నేషనల్ డిఫెన్స్ మెడికల్ సెంటర్ పరిశోధకులు 20 నుండి 59 సంవత్సరాల వయస్సు గల 2,000 మంది పురుషులు, స్త్రీలపై చేసిన అధ్యయనంలో వారానికి కనీసం రెండు సార్లు సెక్స్ చేస్తే గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని గుర్తించారు. అయితే, ఈ మార్పు కేవలం పురుషుల్లో మాత్రమే పని చేస్తున్నట్లు తెలుసుకున్నారు.
తరచుగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గుతాయి. ఇది, గుండె సమస్యలను ప్రేరేపించే రక్తంలోని హానికరమైన రసాయనం. కనుక, హోమోసిస్టీన్ ఏర్పడకుండా నిరోధించడానికి సెక్స్ చాలా ముఖ్యమైనది. అలాగే, ఎక్కువ సెక్స్ చేసే పురుషుల్లో మెరుగైన రక్త ప్రసరణ, ఆరోగ్యకరమైన రక్త నాళాలను కలిగి ఉంటారని అధ్యయనకారులు భావిస్తున్నారు. అయితే హోమోసిస్టీన్‌ను అదుపులో ఉంచడంలో కీలకంగా పనిచేసే ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ విషయంలో లైంగిక ప్రేరేపణ తక్కువగా ఆధారపడి ఉండటం వల్ల, మహిళలు చాలా తక్కువ ప్రయోజనం పొందుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read : సెక్సువల్ పార్ట్‌నర్స్ మధ్య స్పార్క్ ఎలా పెంచుకోవాలి?