బ్లాక్ రైస్‌లో ఔషధ గుణాలు.. డయాబెటిస్, మోకాళ్ల నొప్పికి నివారణగా..

సాధారణంగా మన దేశంలో లభించే బియ్యంలో తెలుపు, ఎరుపు, నలుపు అనే మూడు రకాలు ఉంటాయి. వైట్ రైస్ గురించి అందరికీ తెలుసు. కానీ ఎరుపు, నలుపు రకాలు, వాటి ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు.

Update: 2024-06-01 13:23 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా మన దేశంలో లభించే బియ్యంలో తెలుపు, ఎరుపు, నలుపు అనే మూడు రకాలు ఉంటాయి. వైట్ రైస్ గురించి అందరికీ తెలుసు. కానీ ఎరుపు, నలుపు రకాలు, వాటి ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. పైగా అద్భుతమైన పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉంటాయట. ఏ రంగు బియ్యం ఎలాంటి మేలు చేస్తాయో చూద్దాం.

* కాలాబాట్ అని పిలిచే బ్లాక్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్లుగా ఉంటాయి. వీటిని వండుకొని తినడంవల్ల లేదా ఔషధాల్లో ఉపయోగించడంవల్ల క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు వంటివి రాకుండా ముందుగానే నివారించవచ్చునట. అంతేకాకుండా శరీరంలో హానికారక కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నల్ల బియ్యం అద్భుతంగా పనిచేస్తాయి. విటమిన్ బి, ఇ, నియాసిన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజ విలువు మెండుగా ఉంటాయి. ఫైబర్, ఆంకోసైనిన్స్ కూడా కలిగి ఉండటంవల్ల రోగ నిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

* ఇక కుళ్లాకార్ రైస్‌గా పిలిచే బియ్యం ఎరుపు రంగులో ఉంటాయి. వీటి అన్నం గర్భిణులకు చాలా మంచిదట. తినడంవవల్ల పిల్లల్లో పిల్లల్లో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని చెప్తుంటారు. మాంగనీస్, విటమిన్ బి6, కాల్షియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉండటంవల్ల కుళ్లాకార్ ఎరుపు రకం బియ్యం ఎంతో మేలు చేస్తాయి.

ఎరుపు రంగులోనే ఉండే మరో రకాన్ని నవార రైస్ అంటారు. వీటిని కేరళ సంప్రదాయ ఔషధ గుణాలు కలిగినవిగా పేర్కొంటారు. తరచూ తినడంవల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయని, మెడ, తల, మోకాళ్లు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెప్తారు. నరాల బలహీనత కూడా తగ్గిపోతుంది. కేరళ ఆయుర్వేదంలో ఈ బియ్యపు పిండిని బాడీ మసాజ్‌లో కూడా వాడతారు. 

నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News