మే-14 నేడు మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు

నేడు మాతృమూర్తుల దినోత్సవం. ప్రతి ఏడాది మే నెల రెండవ ఆదివారం ఈ రోజును జరుపుకుంటారు.

Update: 2023-05-14 03:47 GMT

దిశ, వెబ్ డెస్క్: నేడు మాతృమూర్తుల దినోత్సవం. ప్రతి ఏడాది మే నెల రెండవ ఆదివారం ఈ రోజును జరుపుకుంటారు. మొదటగా ఈ వేడుకను గ్రీస్, అమెరికా వంటి దేశాల్లో నిర్వహించినట్లు తెలుస్తోంది. గ్రీస్ లోని రియా అనే దేవతను కొలుస్తారు. ఆమెను మదర్ ఆఫ్ గాడ్స్‌గా భావించి తొలిసారి ఈ మదర్స్ డే నిర్వహించారని సమాచారం. భారతీయులు తల్లిదండ్రులను దైవ సమానులు గా పూజిస్తారు. అలాగే తల్లికి ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు. జీవితంలో తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఎందుకంటే తల్లి తన బిడ్డ సంతోషంగా జీవించడానికి ప్రతి క్షణం తపిస్తూ ఉంటుంది. అలాగే బిడ్డ ఎంత ఎదిగినా కానీ చిన్న పిల్లలా భావించి బిడ్డ బాగోగులను చూసుకుంటుంది. తల్లి ప్రేమ వెల కట్టలేనిది. కాబట్టి తల్లికి ఈ రోజున ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చి వారిని సంతోషంగా గడిపేలా చూసుకోండి.

Also Read..

ఉదయం పూట ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తీసుకుంటే చాలు.. రోగాలన్నీ పరార్! 

Tags:    

Similar News