పోర్న్ సైట్‌లో మ్యాథ్స్ టీచర్ వీడియోలు వైరల్.. తన స్టైల్‌లో నిరూపించుకుని కోట్ల సంపాదన..

కొంచెం కొత్తగా ఆలోచిస్తే సక్సెస్ పక్కా అనేందుకు ఈ మ్యాథ్స్ టీచర్ ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఈ రోజుల్లో ఆన్ లైన్ క్లాసెస్ చెప్పేందుకు వేలల్లో చానల్స్ పుట్టుకురాగా.. పోటీ బాగా పెరిగిపోయింది. ఈ వార్ లో నెగ్గేందుకు, తనను తాను ప్రత్యేకంగా నిలబెట్టుకునేందుకు.

Update: 2024-09-21 17:09 GMT

దిశ, ఫీచర్స్ : కొంచెం కొత్తగా ఆలోచిస్తే సక్సెస్ పక్కా అనేందుకు ఈ మ్యాథ్స్ టీచర్ ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఈ రోజుల్లో ఆన్ లైన్ క్లాసెస్ చెప్పేందుకు వేలల్లో చానల్స్ పుట్టుకురాగా.. పోటీ బాగా పెరిగిపోయింది. ఈ వార్ లో నెగ్గేందుకు, తనను తాను ప్రత్యేకంగా నిలబెట్టుకునేందుకు.. అస్సలు ఊహించని ప్లేస్ లో వీడియోలు అప్ లోడ్ చేశాడు. అనుకున్నట్లుగానే సక్సెస్ అయ్యాడు ఈ సార్. అవును... ఆయన తన మ్యాథ్స్ క్లాస్ వీడియోలను పోర్న్ హబ్ లో పోస్ట్ చేశాడు. లక్షల్లో వ్యూస్.. వేలల్లో సబ్ స్కిప్షన్స్, కోట్లలో సంపాదనతో దూసుకుపోతున్నాడు.

తైవాన్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు చాంగ్ హ్సును.. తన అసాధారణమైన విధానంతో ఆన్‌లైన్ విద్యను విప్లవాత్మకంగా మార్చాడు. అడల్ట్ కంటెంట్‌కి పర్యాయపదంగా ఉండే పోర్న్‌హబ్‌లో గణిత పాఠాల వీడియోలను అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. దాదాపు మూడు మిలియన్ల వీక్షణలు, 13,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లతో.. క్లిక్‌బైట్ స్ట్రాటజీ సక్సెస్ అయింది. అతని పెయిడ్ కోర్సులకు ట్రాఫిక్‌ పెరిగిపోగా.. ఆదాయం సంవత్సరానికి రూ. 2,26,76,719కు పెరిగింది.

Tags:    

Similar News