ప్రపంచంలో సెకండ్ బెస్ట్ నాన్ ఆల్కహాలిక్ పానీయం ఇదే!

భారతీయులకు ఇష్టమైన వాటిలో ‘టీ’ ఒకటి.

Update: 2024-01-25 15:52 GMT

దిశ, ఫీచర్స్: భారతీయులకు ఇష్టమైన వాటిలో ‘టీ’ ఒకటి. ఉదయం నిద్ర లేవగానే కప్పు టీ కడుపులో పడకపోతే వారికి చేతిలో పని పడదు. అంతే కాదు ఇంటికి బంధువు, ఫ్రెండ్స్ ఇలా ఎవరూ వచ్చిన మొదట టీతో ఆతిధ్యం స్టార్ట్ చేస్తారు. అంతలా టీ కి ఎడిక్ట్ అయ్యారు ప్రజలు. మన భారతీయ సాంప్రదాయంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే.. గతంలో ఒకటే రకం టీ ఉండేది. కానీ ఇప్పుడు టీలలో చాలా రకాలు వచ్చాయి. గ్రీన్ టీ, అల్లం టీ, తెల్ల తేనీరు, నల్ల తేనీరు, డార్జిలింగ్ టీ, మసాలా టీ ఎక్స్‌ట్రా. ఇందులో మసాలా టీ కు ప్రత్యేక స్థానం ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే.. ప్రపంచంలోని ఉత్తమ పానీయాలు ఏంటి అనే జాబితా TasteAtlas అనే ఫుడ్ అండ్ ట్రావెల్ బ్లాగర్ Instagram పేజీలో వెల్లడించింది. ఇందులో మసాల చాయ్‌కు రెండవ స్థానం దక్కడం గమనార్హం. ఇటీవల, ప్రముఖ ఫుడ్ & ట్రావెల్ గైడ్ టేస్ట్‌అట్లాస్ 2023-24 సంవత్సరాంతపు అవార్డులలో భాగంగా ప్రశంసల జాబితాను వెల్లడించింది. భారతీయ వంటకాలు, రెస్టారెంట్లు, పదార్థాలు అలాగే వంట పుస్తకాలు ప్రపంచ ప్రత్యర్ధులలో గుర్తింపు పొందాయి. ఈ TasteAtlas ర్యాంకింగ్‌లలో మసాలా టీకు ప్రపంచంలోనే రెండవ అత్యుత్తమ పానీయంగా గుర్తింపు లభించింది. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో టీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Similar News